Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Aadhar Card Loan : మీ ఆధార్ కార్డుతో రూ. 5000 ఇన్‌స్టంట్ లోన్ తీసుకోవచ్చు.. ఎలా అప్లయ్ చేయాలంటే?

Aadhar Card Loan Rs 5000 online apply without documents

Aadhar Card Loan Rs 5000 online apply without documents

Aadhar Card Loan : లోన్ కోసం చూస్తున్నారా? మీకు అకస్మాత్తుగా డబ్బు అవసరమైతే.. ఆధార్ కార్డు ద్వారా కొన్ని నిమిషాల్లోనే రూ. 5,000 ఇన్‌స్టంట్ లోన్ (Aadhar Card Loan) పొందవచ్చు. కానీ, ఈ లోన్ అత్యవసరమైతేనే తీసుకోండి. సకాలంలో చెల్లించడం అసలు మర్చిపోవద్దు. ఈ సౌకర్యం దేశంలోని యువత, శ్రామిక ప్రజలకు బిగ్ రిలీఫ్ అని చెప్పొచ్చు.

అకస్మాత్తుగా డబ్బు అవసరం పడితే ఇప్పుడు ఆధార్ కార్డు ద్వారా నిమిషాల్లో సులభంగా ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం లేకుండా రూ. 5,000 వరకు లోన్ పొందవచ్చు. ఫిన్‌టెక్, NBFC కంపెనీలు లోన్ ప్రక్రియను సులభతరం చేశాయి. కేవలం డిజిటల్ అప్లికేషన్, ఆధార్, పాన్ చేతిలో ఉంటే చాలు.. ఈ మొత్తాన్ని నేరుగా మీ బ్యాంకు అకౌంట్లో క్రెడిట్ అవుతుంది.

Aadhar Card Loan : ఈ లోన్ ఎవరు తీసుకోవచ్చు? :

ఇందుకోసం దరఖాస్తుదారుడి వయస్సు సాధారణంగా 21 ఏళ్ల కన్నా ఎక్కువగా ఉండాలి. సాధారణ ఆదాయ వనరుతో పాటు ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్ తప్పనిసరి. లోన్ కోసం ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో ఉంటుంది. చాలా సులభం కూడా. రిజిస్ట్రేషన్, OTP వెరిఫికేషన్, కనీస డాక్యుమెంటేషన్ ఉండాలి.

Advertisement

ఎలా అప్లయ్ చేయాలంటే? :

వడ్డీ రేట్లు, నిబంధనలు :
చిన్న రుణాలపై వార్షిక వడ్డీ రేటు 15శాతం నుంచి 36శాతం వరకు ఉంటుంది. కాలపరిమితి సాధారణంగా 3 నెలల నుంచి 6 నెలలు. సకాలంలో EMI చెల్లించకపోవడం, మీ క్రెడిట్ స్కోర్‌ దెబ్బతింటుంది. సకాలంలో పేమెంట్లు చేయడం చాలా ముఖ్యం. ఆటో-డెబిట్ లేదా NACH ఫారమ్ వంటి సౌకర్యం కూడా లోన్ పేమెంట్ కోసం అందుబాటులో ఉంది. త ద్వారా వాయిదాలు ఆటోమాటిక్‌గా డెబిట్ అవుతాయి.

Aadhar Card Loan : ప్రయోజనాలు, జాగ్రత్తలు :

ఈ లోన్ సౌకర్యం ముఖ్యంగా క్రెడిట్ కార్డ్ లేని వారికి లేదా బ్యాంకు నుంచి తొందరగా రుణాలు పొందలేని వారికి మంచిది. ఆధార్ కార్డ్ లోన్ తీసుకోవడం అనేది రిజిస్టర్ కానీ వడ్డీ మర్చంట్ నుంచి లేదా అధిక వడ్డీకి రుణం తీసుకోవడం కన్నా సురక్షితమైనది. లోన్ ప్రాసెస్ కూడా చాలా స్పీడ్ ఉంటుంది. అత్యవసర లేదా తాత్కాలిక అవసరం విషయంలో మాత్రమే ఈ లోన్ తీసుకోవచ్చు. అదేపనిగా లోన్లు తీసుకుంటే అప్పుల్లో చిక్కుకుంటారు జాగ్రత్తగా ఉండాలి.

క్రెడిట్ హిస్టరీ పెరగాలంటే? :
ఈ చిన్న లోన్ తీసుకున్నాక EMI సకాలంలో చెల్లిస్తుంటే మీ క్రెడిట్ రిపోర్టు మెరుగుపడుతుంది. భవిష్యత్తులో పెద్ద లోన్లు తీసుకోవచ్చు.

Advertisement

Read Also : Business Idea : మీ జాబ్‌కు గుడ్‌బై చెప్పేయండి.. ఈ 5 బిజినెస్‌లతో కోట్లు సంపాదించుకోవచ్చు.. తక్కువ పెట్టుబడితో కోట్ల ఆదాయం..!

పాన్ లేకుండా కేవలం ఆధార్‌తో లోన్ వస్తుందా? :
చాలా సందర్భాలలో పాన్, ఆధార్ రెండు డాక్యుమెంట్లు అవసరం.

రూ.5,000 లోన్‌కు క్రెడిట్ చెక్ ఉందా? :
అవును.. లోన్ రావాలంటే ముందు క్రెడిట్ చెక్ కచ్చితంగా జరుగుతుంది.

Advertisement

ఈ యాప్‌లలో ఫీచర్‌ పొందొచ్చు :
ఈ ఆధార్ లోన్ సౌకర్యం KreditBee, Moneyview, mPokket, Pocketly మొదలైన యాప్‌లలో అందుబాటులో ఉంది. కానీ, ఎక్కడి నుండైనా లోన్ తీసుకునే ముందు కచ్చితంగా RBI రిజిస్ట్రేషన్‌ను చెక్ చేయండి.

Advertisement
Exit mobile version