Acer Aspire Go 14 : ఏసర్ ఆస్పైర్ గో 14 ల్యాప్ టాప్ లాంచ్ అయింది. కంపెనీ అత్యంత సరసమైన AI-ఆధారిత ల్యాప్‌టాప్ భారత మార్కెట్లో రిలీజ్ చేసింది. విద్యార్థులు, హోం యూజర్లు లేదా మొదటిసారి కొనేవారికి బెస్ట్‌ల్యాప్‌టాప్. ఇంటెల్ కోర్ అల్ట్రా 7 H-సిరీస్ CPUతో వస్తుంది. 65W USB-C అడాప్టర్‌తో పాటు 55Wh మూడు-సెల్ బ్యాటరీకి సపోర్టు ఇస్తుంది. Acer Aspire Go 14 ల్యాప్‌టాప్‌లో కోపైలట్ కీ, ఇంటెల్ AI బూస్ట్ NPU ఉన్నాయి. ఆస్పైర్ గో 14 14-అంగుళాల WUXGA డిస్‌ప్లే, అల్యూమినియం బిల్డ్‌ను కలిగి ఉంది.
భారత్‌లో Acer Aspire Go 14 ధర ఎంత? :
భారత మార్కెట్లో ఏసర్ Aspire Go 14 ధర రూ.59,999 నుంచి ప్రారంభమవుతుంది. క్లియర్ సిల్వర్ ఎండ్‌తో వస్తుంది. Acer వెబ్‌సైట్‌తో పాటు, ఈ ల్యాప్‌టాప్ ఆఫ్‌లైన్ Acer ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌లు, Amazon ద్వారా కూడా అమ్మకానికి అందుబాటులో ఉంది. కోర్ అల్ట్రా 7 155H CPU, 32GB వరకు RAM సపోర్టు ఇచ్చే ఏసర్ Aspire Go 14 మోడల్ OLED వేరియంట్ అధికారిక ఇ-స్టోర్‌లో రూ.99,999కు అందుబాటులో ఉంది.
ఏసర్ ఆస్పైర్ గో 14 ఫీచర్లు :
Acer Aspire Go 14 ల్యాప్‌టాప్ 16:10 యాస్పెక్ట్ రేషియోతో 14-అంగుళాల WUXGA IPS డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇంటెల్ కోర్ అల్ట్రా 7 H-సిరీస్ CPU, ఇంటెల్ ఆర్క్ గ్రాఫిక్స్, ఇంటెల్ AI బూస్ట్ NPU ద్వారా పవర్ అందిస్తుంది. ఈ ల్యాప్‌టాప్ 32GB DDR5 RAM, 1TB PCIe Gen 3 SSD స్టోరేజ్ వరకు సపోర్టు ఇస్తుంది. విండోస్ 11 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌లో నడుస్తుంది. ఏసర్ ఆస్పైర్ గో 14లో ప్రత్యేకమైన కోపైలట్ కీ కూడా ఉంది. కొన్ని ఏఐ ఫీచర్లను కలిగి ఉంది. వినియోగదారులు టెక్స్ట్‌ను ఎక్‌ట్రాక్ట్ చేసేందుకు వాయిస్ ద్వారా యాక్షన్లను యాడ్ చేయొచ్చు.
ఈ ఏసర్ ల్యాప్‌టాప్‌లో ప్రైవసీ కోసం ఫిజికల్ షట్టర్ HD వెబ్‌క్యామ్ కూడా ఉంది. Acer Aspire Go 14 ల్యాప్‌టాప్ 55Wh 3-సెల్ బ్యాటరీని అందిస్తుంది. 65W USB-C అడాప్టర్‌కు సపోర్టు ఇస్తుంది. కనెక్టివిటీ ఎంపికలలో Wi-Fi 6, బ్లూటూత్ 5.2, RJ45 పోర్ట్, రెండు USB 3.2 టైప్-A పోర్ట్‌లు, రెండు USB టైప్-C పోర్ట్‌లు ఉన్నాయి. డిస్ప్లేపోర్ట్‌కు సపోర్టు ఇస్తుంది. మరొకటి ఛార్జింగ్ కోసం అందిస్తుంది. అల్యూమినియం ఫ్రేమ్ 1.5 కిలోల బరువు, 17.5 మిమీ మందంతో వస్తుంది.