Aadhaar Face Authentication : ఇకపై OTP, ఫింగర్‌ఫ్రింట్స్ అక్కర్లేదు.. పోస్టాఫీసుల్లో ఆధార్ ఫేస్ అథెంటికేషన్.. మీ ముఖం చూపించి డబ్బులు తీసుకోవచ్చు!

Updated on: August 3, 2025

Aadhaar Face Authentication : వృద్ధులు, వికలాంగులకు గుడ్ న్యూస్.. ఇకపై డిజిటల్ బ్యాంకింగ్ సమయంలో మీకు OTP లేదా ఫింగర్ ఫ్రింట్ అవసరం లేదు. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) కొత్త సౌకర్యాన్ని తీసుకొచ్చింది. మీరు ఫేస్ ఐడెంటిటీ ద్వారా బ్యాంకింగ్ లావాదేవీలు చేయొచ్చు.

అంటే.. ఇప్పుడు మీ ముఖమే పాస్‌వర్డ్‌గా మారింది. ఈ సదుపాయాన్ని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) వ్యవస్థ కింద అభివృద్ధి చేశారు. వినియోగదారులు తమ ఫేస్ అథెంటికేషన్ ద్వారా ఆధార్ అథెంటికేషన్ పూర్తి చేయొచ్చు. ఈ సౌకర్యం వృద్ధులకు, వికలాంగులకు, అత్యవసర సమయాల్లో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. తద్వారా ఆధార్ సంబంధిత మోసాలకు చెక్ పెట్టొచ్చు.

Read Also : Loan on PAN : మీ పాన్ కార్డుపై ఇంకెవరైనా లోన్ తీసుకున్నారా? ఇలా చెక్ చేయండి.

Advertisement

Aadhaar Face Authentication : వృద్ధులు, వికలాంగులకు భారీ ఊరట :

ఈ ఫేస్ అథెంటికేషన్ సౌకర్యంతో వృద్ధులు, వికలాంగులు, ఫింగర్ ఫ్రింట్స్ సరిగా లేనివారికి వరం. పదే పదే ఫింగర్ ఫ్రింట్స్ నమోదు చేయడం లేదా OTP పొందడం వంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. కెమెరా ముందు మీ ముఖాన్ని చూపిస్తే చాలు పని పూర్తవుతుంది.

Aadhaar Face Authentication : ఆరోగ్యం, అత్యవసర పరిస్థితుల్లో ప్రయోజనకరం :

ఎవరైనా అనారోగ్యంతో ఉన్నా లేదా శారీరకంగా సాధ్యం కాని పరిస్థితి ఉంటే ఈ ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ కొత్త సౌకర్యం సురక్షితమైన బ్యాంకింగ్‌ సేవలను అందిస్తుంది.

IPPB బ్యాంకింగ్ సేవలు :

“బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండటమే కాకుండా గౌరవప్రదంగా కూడా ఉండాలని కోరుకుంటున్నాం. OTP లేదా బయోమెట్రిక్స్ ఇవ్వలేని వ్యక్తులను ఒకచోట చేర్చేందుకు ఈ కొత్త టెక్నాలజీని తీసుకొచ్చాం” అని ఐపీపీబీ ఎండీ, సీఈఓ ఆర్ విశ్వేశ్వరన్ పేర్కొన్నారు.

Advertisement

FAQs For IPPB Face Authentication : 

ఆధార్‌లో ఫేస్ అథెంటికేషన్ అంటే ఏంటి? :

ఆధార్ ఫేస్ అథెంటికేషన్ అనేది ఆధార్-లింక్డ్ సర్వీసులను యాక్సెస్ చేసేందుకు ఫింగర్ ఫ్రింట్ లేదా ఐరిస్ స్కాన్‌లకు బదులుగా యాక్సస్ చేయొచ్చు. ఖాతాదారుల ఫేస్ ఫీచర్లతో వ్యక్తి ఐడెంటిటీని ధృవీకరించే పద్ధతి.. ఇది అథెంటికేషన్ సమయంలో క్యాప్చర్ చేసిన ముఖ చిత్రాన్ని రిజిస్టర్ సమయంలో UIDAI డేటాబేస్‌లో స్టోర్ చేసి ఉంటుంది. బ్యాంకింగ్, ప్రయాణం, ఆరోగ్య సంరక్షణ, షాపింగ్ వంటి వివిధ యాప్స్ ద్వారా ఉపయోగించవచ్చు.

IPPB ఆధార్ కార్డులో మొబైల్ నంబర్‌ను ఎలా మార్చాలి? :

మీరు ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్ సందర్శించడం ద్వారా లేదా పోస్ట్‌మ్యాన్ ద్వారా ఆధార్‌లో లేదా మీ మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకోవచ్చు. ఇందుకు ఎలాంటి డాక్యుమెంట్ పాత మొబైల్ నంబర్ అవసరం లేదు.

IPPB మొబైల్ బ్యాంకింగ్‌లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలి?

ముందుగా IPPB యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో గూగుల్ ప్లే స్టోర్ నుంచి IPPB యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి. మీ వివరాలను ఎంటర్ చేయండి. బ్యాంకు అకౌంట్ ఖాతా, కస్టమర్ ID (CIF) పుట్టిన తేదీ వివరాలు ఉండాలి.

ఆధార్ ఫేస్ అథెంటికేషన్ ఎలా డౌన్‌లోడ్ చేయాలి? :

Google Play Store నుంచి AadhaarFaceRd APP డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయండి. Android ఫోన్‌ల కోసం https://attendance.gov.in లేదా https://central.attendance.gov.in నుంచి లేటెస్ట్ ఫేస్ పర్సనల్ క్లయింట్‌ను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయండి IoS ఫోన్ కోసం AppStore నుంచి AadhaarBAS యాప్‌ను ఇన్‌స్టాల్ చేయండి.

IPPBలో ఆధార్ మొబైల్ అప్‌డేట్ ఛార్జీలు ఎంత? :

IPPB ఆధార్ మొబైల్ నంబర్ అప్‌డేట్‌తో సహా అన్ని ఆధార్ అప్‌డేట్ మోడ్‌లు, ప్రతి అప్‌డేట్‌కు రూ. 50 చెల్లించాలి.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel