Priyamani: టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన ప్రియమణి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎవరే అతగాడు సినిమా ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ప్రియమణి ఆ తర్వాత టాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకొని స్టార్ హీరోల సరసన నటించి హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది. ప్రియమణి గ్లామరస్ పాత్రలలో మాత్రమే కాకుండా వైవిధ్యమైన పాత్రలలో కూడా నటించి తన అందం అభినయంతో ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది. హీరోయిన్ గా వెండితెర మీద మంచి గుర్తింపు పొందిన ప్రియమణి బుల్లితెర మీద కూడా తనకంటూ మంచి గుర్తింపు ఏర్పరుచుతుంది. అంతేకాకుండా ఈ అమ్మడు డిజిటల్ స్క్రీన్ మీద కూడా తన సత్తా చాటుకుంది. బాలీవుడ్లో ఫ్యామిలీ మెన్ అనే వెబ్ సిరీస్ లో నటించి మెప్పించింది.
టెలివిజన్ లో ప్రసారం అవుతున్న అనేక రియాలిటీ షో లలో పాల్గొంటూ వాటికి న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తూ బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ డాన్స్ షోలో చాలాకాలం జడ్జ్ గా వ్యవహరిస్తూ మెప్పించింది. ఈ షో లో ఈ అమ్మడు అప్పుడప్పుడు శేఖర్ మాస్టర్ తో కలిసి స్టెప్పులేసి సందడి చేసింది. అంతేకాకుండా తన బాడీని ఫిట్ గా ఉంచుకోవటానికి తరచూ డాన్స్ చేస్తూ ఉంటుందని సమాచారం. ఇటీవల ప్రియమణికి సంబంధించిన ఒక డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రేమని ఇటీవల తన టీం తో కలిసి డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.
Priyamani:
ఈ వీడియోలో ప్రియమణి ఎంతో కష్టపడి చెమటలు చిందిస్తూ.. తన శరీరాన్ని వయ్యారంగా తిప్పుతూ డాన్స్ తో అదరగొట్టింది. ఈ వీడియో చూసిన నేటిజన్స్ ప్రియమణికి మళ్లీ హీరోయిన్ గా అవకాశాలు ఇవ్వండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ప్రియమణి ప్రస్తుతం చేస్తున్న డాన్స్ ప్రాక్టీస్ బుల్లితెర మీద ప్రసారమవుతున్న స్పెషల్ ఈవెంట్ కోసమని తెలుస్తోంది . చాలాకాలంగా బుల్లితెరకి దూరంగా ఉన్న ప్రియమణి బుల్లితెర మీద ప్రసారం కానున్న కార్యక్రమంలో పాల్గొంటుందని సమాచారం.
Tufan9 Telugu News And Updates Breaking News All over World