Bride Work Outs In Gym : జిమ్ లో పెళ్లి కూతురు.. ఎందుకో మరి ఈ కసరత్తులు.. అత్తగారికి చుక్కలే.. వీడియో వైరల్!

Birde excersize in gym: ఈ మధ్య కాలంలో పెళ్లిళ్ల తంతులు ఎంత గ్రాండ్ గా జరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రీ వెడ్డి, పోస్ట్ వెడ్డింగ్ అంటూ ఫొటో షూట్లు.. డ్యాన్సులు, హల్దీ ఫంక్షన్లు, సంగీత్ లు, భరాత్ లు అంటూ కోట్లు ఖర్చు చేస్తున్నారు. తమ స్థోమతను బట్టి లక్షలు, కోట్లు ఖర్చు చేస్తూ.. తెగ ఎంజాయ్ చేస్తుంటారు. కొందరేమో పెళ్లిల్లో బాగా కనిపించేందుకు అబ్బాయిలేమో జిమ్ ల చుట్టూ, అమ్మాయిలేమో బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరుగుతూ అందగా కనిపించేందుకు తెగ కష్టపుడుతుంటారు.

Advertisement

అయితే తమిళనాడుకు చెందిన ఓ యువతి వినూత్నంగా పెళ్లి బట్టలతో జిమ్ కు వెళ్లింది. అంతేనా జిమ్ లో బరువులు ఎత్తుతూ.. ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ లో పాల్గొంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. అయితే అసలు ఆమె పెళ్లి బట్టల్లో ఎందుకు జిమ్ కు వెళ్లిందో మాత్రం ఎవరికీ తెలియదు. కానీ ఈ వీడియో చూసిన ప్రతీ ఒక్కరూ ఒక్కోలా స్పందిస్తున్నారు.

అత్తగారింటికి వెళ్లాకా ఆమెను ఎవరైనా ఏమానా అంటే సమాధానం చెప్పేందుకు జిమ్ లో కసరత్తులు చేస్తోందని కొందరు.. ఇక పెళ్లి కొడుకు పని అయిపోయినట్లే అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా పెళ్లి బట్టల్లో కసరత్తు చేస్తూ… ఆ కొత్త పెళ్లి కూతురు తెగ వైరల్ అయిపోతోంది.

Advertisement