CM KCR : హుజురాబాద్ ఎఫెక్ట్‌తో రంగంలోకి కేసీఆర్.. టార్గెట్ బీజేపీగా సరికొత్త వ్యూహం

Updated on: August 4, 2025

CM KCR :  హుజురాబాద్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలిందని అందరికీ తెలిసిందే. ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్ ఆదివారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో బీజేపీ పై వెల్లగక్కిన అసహనమే అందుకు నిలువుటద్దంలా మారింది. ఇన్నిరోజులు బీజేపీని లైట్ తీసుకున్న కేసీఆర్.. తనపై గానీ, టీఆర్ఎస్ పార్టీపై గానీ పిచ్చిపిచ్చిగా కామెంట్స్ చేస్తే ఊరుకునేది లేదని బీజేపీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

దమ్ముంటే తనను టచ్ చేసి చూడాలని, నన్ను జైలుకు పంపించి బతికి బట్టగడుతారా? అని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్‌ను హెచ్చరించారు. మొన్నటివరకు కేంద్రం తీసుకున్న అనేక నిర్ణయాలను సపోర్టు చేస్తూ వచ్చిన టీఆర్ఎస్ పార్టీ హుజురాబాద్ ఫలితంతో ఒక్కసారిగా రివర్స్ అటాక్ చేయడంపై పొలిటికల్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాల వల్లే ఈరోజు దేశం ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అమ్ముకుంటున్నారని, సెస్ రూపంలో పెట్రోల్ ధరలను అడ్డగోలుగా పెంచారని ధ్వజమెత్తారు. ఇవన్నీ ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయాలు కావని, ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయించే పర్వం ఏడాది కాలంగా కొనసాగుతోందన్నారు. ధాన్యం కొనమని కేంద్రమే చెప్పిందని, అందుకే రాష్ట్రంలోని రైతులను వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని చెప్పామన్నారు. కావాలనే ప్రతిపక్షాలు రైతులను రెచ్చగొట్టి వరి పంట వేయాలని తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్దారు.

Advertisement

ఇకపోతే కేంద్రం ఎన్నో తప్పుడు వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని ఫైర్ అయ్యారు. ధాన్యం పంటల వేయకుండా ఉండేందుకు బలవంతంగా తమతో సంతకాలు పెట్టించుకున్నారని వివరించారు. అయితే, ఇన్నిరోజులు కేంద్రంతో సఖ్యతగా ఉన్న కేసీఆర్ ఒక్కసారిగా ఎదురు తిరగడానికి కారణమేంటని అందరూ ఆలోచిస్తున్నారు. కేంద్రం అంతగా రాష్ట్రప్రభుత్వాన్ని ఇబ్బంది పెడితే అప్పుడే ఎందుకు ఎదురుతిరగలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు.
Read Also : Pawan Kalyan : వైసీపీకి ఇచ్చిన గడువు ముగిసింది.. పవన్ నెక్ట్స్ స్టెప్ ఏంటి?

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel