Jobs notification: మరో 1663 ఉద్యోగాల భర్తీకి సర్కారు అనుమతి!

Jobs notification: రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియను కొనసాగిస్తున్న ప్రభుత్వం… మరో 1663 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 1663 ఖాళీల్లో.. ఇంజినీరింగ్ విభాగంలో 1522 పోస్టులు భర్తీ చేయనున్నారు. కొత్తగా భర్తీ చేయనున్నారు. కొత్తగా భర్తీ చేయనున్న పోస్టుల వివరాల చూద్దాం. నీరు పారుదల శాఖలో 704 ఏఈఈ పోస్టులు ఉండగా… అందే శాఖలో 227 ఏఈ పోస్టులు ఉన్నాయి. అలాగే 212 జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు, 95 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు, భూగర్భ జల శాఖలో 88 పోస్టులు, ఆర్ అండ్ బీ లో 38 ివిల్ ఏఈ పోస్టులు, 145 సివిల్ ఏఈఈ పోస్టులు, 13 ఎలక్ర్టిక్ ఏఈఈ పోస్టులు, 60 జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు, 27 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు, ఆర్థి శాఖలో 53 డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

తాజా అనుమతులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం 46,998 పోస్టుల భర్తీకి అనుమతులు ఇచ్చింది. మిగిలిన పోస్టుల భర్తీకి అనుమతుల ప్రక్రియను ఆర్థిక శాఖ ముమ్మరం చేసింది. త్వరలోనే ఆ పోస్టుల భర్తీకి అనుమతులు ఇవ్వనున్నారు.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel