Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Wine shops closed: హనుమాన్ జయంతి సందర్భంగా రేపు వైన్ షాపులు బంద్..!

హనుమాన్ జయంతి సందర్భంగా రేపు హైదరాబాద్ లో బార్లు, మద్యం దుకాణాలు బంద్ చేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం

By Vinod Kumar

Published on: April 15, 2022 4:16 PM

Updated on: April 15, 2022 4:16 PM

---Advertisement---

హనుమాన్ జయంతి సందర్భంగా రేపు హైదరాబాద్ లో బార్లు, మద్యం దుకాణాలు బంద్ చేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6 వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో జరగనున్న ఆంజనేయ స్వామి శోభాయాత్ర గౌలిగూడలోని రాంమందిర్ నుంచి సికింద్రాబాద్ తాడ్​బండ్​ హనుమాన్ ఆలయం వరకు జరగనుందని వెల్లడించారు. శోభాయాత్ర ఏర్పాట్లను సీవీ ఆనంద్ పరిశీలించారు.

wine shops closed in hyderdab for hanuman jayanthi

Advertisement

వీర హనుమాన్ విజయ యాత్ర ద్విచక్ర వాహన ర్యాలీ రూట్ మ్యాప్​ను సంబంధిత పోలీసు అధికారులను, నిర్వాహకులను సీపీ అడిగి తెలుసుకున్నారు. భజరంగ్ దళ్, వీహెచ్​పీ నాయకులతో కలిసి తాడ్​బండ్ వరకు చేరుకుని యాత్ర ఏర్పాట్ల గురించి ఆరా తీశారు. అంతకు ముందు సీపీతో పాటు నగర జాయింట్ సీపీ రమేష్ రెడ్డి, డీసీపీ సతీష్, ఏసీపీ దేవేందర్, సీఐలు రవీందర్ రెడ్డి, సుబ్బిరామి రెడ్డి, భిక్షపతి రాంమందిర్​లో పూజలు నిర్వహించారు.

, ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.