Guppedantha Manasu: సాక్షితో పెళ్లికి సిద్ధమైన రిషి…షాక్ లో వసుధార!

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత సీరియల్ కి రోజు రోజుకు ఎంతో మంది అభిమానులు పెరిగిపోతున్నారు. కాలేజ్ బ్యాక్ డ్రాప్లో ప్రేమ కథ ,కుటుంబ కథ నేపథ్యంలో ప్రసారమవుతున్న ఈ సీరియల్ కి యువత సైతం అభిమానులుగా మారిపోయారు. ఇక నేటి ఎపిసోడ్ ఎంతో ఉత్కంఠ భరితంగా కొనసాగుతుంది… ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా వసుధార కాఫీ షాప్ లో రిషి కోసం ఎదురుచూస్తూ అక్కడ ఒకరి ఆర్డర్ మరొకరికి ఇస్తూ ఉంటుంది. ఎందుకు ఇంకా రిషి సార్ రాలేదు అని ఆలోచిస్తుండగా.. అంతలోనే రిషి వసుధారకు బయటికి రాగలవా అంటూ మెసేజ్ చేస్తారు. ఆ మెసేజ్ చూసిన వస ధర ఎంత సంతోషంగా బయటికి వెళుతుంది.

ఈ విధంగా వీరిద్దరూ కారులో వెళ్తూ వసు గతంలో నువ్వు పెళ్లి పీటల మీద నుంచి ఎందుకు లేచి వచ్చావు? నీకు చదువు అంటే ఇష్టం కాబట్టి కదా.. అప్పుడే పెళ్లి చేసుకోవాలని ఉద్దేశం లేకపోవడంతో పెళ్లి వద్దనుకొని లేచి వచ్చావు అలాగే నువ్వు ఒక రోజు నాతో మాట్లాడుతూ నాకు ఉన్న లక్ష్యం చదువు ఒకటేసార్ అని చెప్పావు. ఆ చదువును అలాగే కొనసాగించు మన కాలేజీకి మంచి పేరు తీసుకురా అంటూ చెప్పారు.ఈ విధంగా రిషి చెబుతుండడంతో వసుధార తిరిగి ప్రశ్నించ లేక సార్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అంటూ మనసులో తానే మాట్లాడుకుంటుంది.

Advertisement

ఇలా మనం కారులో వెళ్తుంటే ఎంతో బాగుంటుంది ఇలా ఎన్నోసార్లు ప్రయాణం చేసాము ఇవన్నీ తీపి గుర్తులుగా మిగిలిపోతాయి కదా వసుధారా అంటూ మాట్లాడుతారు. రిషి ఇలా మాట్లాడే సరికి వసుధారకు ఏమీ అర్థం కాకుండా అలాగే ఉండిపోతుంది. అంతలోగా నువ్వు దిగవలసిన గమ్యం వచ్చింది వసుధారా అంటూ తనని దింపుతాడు.ఇకపోతే వసుధార రిషికి ఇచ్చిన గిఫ్ట్ చేతిలో పట్టుకొని తాను తన మనసులో మాట చెప్పాలనుకున్న చెప్పలేని పరిస్థితి ఏర్పడింది అంటూ ఆలోచిస్తూ ఉంటుంది.మరోవైపు రిషి ఇంట్లో వారి కుటుంబ సభ్యులందరూ అక్కడే కూర్చుని నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు.

ఆ సమయంలో రిషి అక్కడికి వచ్చి అందరూ ఇక్కడే ఉన్నారా మీ అందరికీ ఒక విషయం చెప్పాలి అంటూ… పెద్దమ్మ తొందరగా సాక్షి వాళ్ళ అమ్మానాన్నలను రమ్మని చెప్పు అని చెబుతాడు. సాక్షి అమ్మ నాన్నలు ఎందుకు అని ప్రశ్నించగా లగ్నపత్రిక రాయించుకోవడానికి నేను సాక్షిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యే లేచి నిలబడతారు. ఇదే నా నిర్ణయం మీకు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా అని అడగగా నీ ఇష్టం కాదు అనడానికి మేము ఎవరు అని చెబుతారు.

ఇకపోతే పెళ్లికి మాత్రం వారి కుటుంబం మన కుటుంబం మాత్రమే చాలు అంటూ మనిషి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరోవైపు వసుధార రిషి గురించి ఆలోచిస్తూ ఉండగా జగతి మేడం ఫోన్ చేస్తుంది. ఫోన్ చేయగానే వసుధార రిషి ఏంటి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు అని ప్రశ్నించగా ఏం చేశారు మేడం అని వసుధార అడుగుతుంది.సాక్షిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు అని చెప్పగానే ఒకసారిగా వసుధార షాక్ తో తన ఫోన్ కింద పడేస్తుంది. మరోవైపు రిషి తన గదిలో వసుధార ఇచ్చిన కొన్ని కానుకలను చూస్తూ ఉండిపోతారు. ఇలా వసు గురించి ఆలోచిస్తూ ఉండగా అక్కడకు మహేంద్ర రావడంతో ఈ ఎపిసోడ్ పూర్తి అవుతుంది. నిజంగానే రిషి సాక్షిని పెళ్లి చేసుకుంటారా ఈ సీరియల్ ఎటు మలుపు తిరగబోతుంది అని ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 Telugu News And Updates Breaking News All over World

RELATED POSTS

Join our WhatsApp Channel