TS SSC Exams Date : తెలంగాణ పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్.. 2022 ఏడాదిలో తెలంగాణ టెన్త్ పరీక్షలకు సంబంధించి షెడ్యూల్ రిలీజ్ అయింది. ఈ మేరకు తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (SSC Exam) షెడ్యూల్‌ను విడుదల చేసింది.
మే 11,2022 నుంచి టీఎస్ తెలంగాణ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పది పరీక్షల్లో చివరి పరీక్ష మే 20, 2022తో ముగియనుంది. గత రెండు విద్యాసంవత్సరాల్లో కరోనా కారణంగా పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేదు. దాంతో విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేసింది బోర్డు.

ప్రస్తుతం కరోనా పరిస్థితులు అనుకూలించడంతో కేసులు కూడా తగ్గుముఖం పట్టడంతో తెలంగాణ పదో పరీక్షలను నిర్వహించాలని బోర్డు భావించింది. ప్రస్తుత కరోనా పరిస్థితులను అంచనా వేసి పదో తరగతి పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించింది.
ఇప్పటికీ రాష్ట్రంలో కరోనా థర్డ్ వేవ్ పరిస్థితులు కూడా తగ్గుముఖం పట్టడంతో స్కూళ్లను తిరిగి తెరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ పదో పరీక్షలను నిర్వహించాలని బోర్డు నిర్ణయం తీసుకుంది.
Read Also : Khiladi Movie Review : ఖిలాడీ మూవీ రివ్యూ :
















