Google Map: గూగుల్ మ్యాప్ లో అందుబాటులోకి వచ్చిన సరికొత్త ఫీచర్… ఇకపై డబ్బు మొత్తం ఆదా!

Google Map: ప్రస్తుత కాలంలో మనం ఒక ప్రదేశం నుంచి మరొక తెలియని ప్రదేశానికి ప్రయాణం చేయాలంటే మనకు గూగుల్ మ్యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇలా కొత్త ప్రదేశాలకు దారి చూపడం కోసం గూగుల్ మ్యాప్ ఎన్నో అద్భుతమైన ఫీచర్లను మనముందుకు తీసుకువచ్చింది. అయితే త్వరలోనే ఈ గూగుల్ మ్యాప్ ద్వారా మరికొన్ని ఫీచర్స్ అందుబాటులోకి రానున్నాయి. ఈ ఫీచర్ ద్వారా మనం అధిక మొత్తంలో సమయం మాత్రమే కాకుండా, డబ్బును కూడా ఆదా చేసుకోవచ్చు.

రానున్న రోజులలో గూగుల్ మ్యాప్ అప్డేట్ ద్వారా మనం ప్రయాణిస్తున్న మార్గంలో ఎన్ని టోల్ గేట్స్ ఉన్నాయి,మనం మన గమ్యస్థానాన్ని చేరుకునేలోపు టోల్ గేట్ కోసం ఎంత డబ్బు కట్టాల్సి వస్తుందనే విషయాల గురించి తెలుసుకోవచ్చు. కేవలం మనం వెళ్లే మార్గాన్ని టైప్ చేస్తే మనకు ఈ వివరాలన్నీ తెలిసిపోతాయి.ఈ విధంగా టోల్ గేట్ కోసం మనం ఎంత ఖర్చు చేయాల్సి వస్తుందనే విషయాన్ని తెలుసుకోవాలంటే మనం ప్రయాణించే మార్గాన్ని టైప్ చేసి సీ టోల్ పాస్ ప్రైస్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే మనం ఎంత చెల్లించాలో తెలియజేస్తుంది.

ఒకవేళ మన ప్రయాణించే మార్గంలో టోల్ లేకుండా ఉండే మార్గం కావాలన్నా గూగుల్ ఈ యాప్ ద్వారా మరొక మార్గాన్ని కూడా మనకు తెలియజేస్తుంది.ఒకవేళ టోల్ లేకుండా ఆ దారి సరిగ్గా ఉంటే మనం ఆ దారిని ఎంపిక చేసుకుని ఎక్కువ మొత్తంలో డబ్బు ఆదా చేసుకోవచ్చు.అయితే ఈ అద్భుతమైన ఫీచర్స్ భారతదేశంతో పాటు అమెరికా వంటి ఇతర దేశాలలో కూడా అందుబాటులోకి తీసుకురానుంది. ట్రాఫిక్ సిగ్నల్ విషయం నుంచి రోడ్ల విస్తీర్ణత విషయాల గురించి కూడా సరికొత్త ఫీచర్ ద్వారా తెలుసుకోవచ్చు.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 Telugu News And Updates Breaking News All over World

Join our WhatsApp Channel