AP News: మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం చేసిన జగన్… ఆ ముగ్గురు పదవులు సేఫ్?

AP News: గత సార్వత్రిక ఎన్నికలలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతమంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసిన సంగతి మనకు తెలిసిందే అయితే రెండున్నర సంవత్సరాల తర్వాత మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేస్తానని ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు.అయితే అప్పుడు అతను చెప్పిన విధంగానే ప్రస్తుతం మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేయటానికి ఆయన అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ గురించి పలుసార్లు చర్చించడంతో పలువురు మంత్రులు ఆందోళన చెందుతున్నారు.

మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఎవరి మంత్రి పదవులు ఊడిపోనున్నాయనే అలజడి ప్రతి ఒక్క మంత్రి లోనూ ఉంది.అయితే కొత్త మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కోసం జగన్ ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఏప్రిల్ 11వ తేదీ కొత్త మంత్రులు ప్రమాణం స్వీకారం చేయనున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 11వ తేదీ మంత్రులుగా కొత్తవారు ప్రమాణస్వీకారం చేయనున్నారని తెలియడంతో ప్రస్తుతమున్న మంత్రులలో భయం ఏర్పడింది.

ఇప్పుడు ప్రస్తుతం మంత్రులుగా ఉన్నటువంటి వారు కొడాలి నాని, బొత్స సత్యనారాయణ, పేర్ని నాని ముగ్గురు పదుల కి ఎలాంటి గండం లేదని సమాచారం. ఈ ముగ్గురు మంత్రుల పదవులు అలాగే ఉంటాయని ఇతరుల అందరిని మారుస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఎవరికి పదవులు పోనున్నాయి,కొత్తగా ఎవరు మంత్రి పదవిని దక్కించుకుంటారు అనే విషయంపై వైసీపీ నేతల్లో ఆందోళన మొదలైంది.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel