Tecno spark 9: టెక్నో ఫోన్ వచ్చేసింది.. రూ.10 వేల లోపు సూపర్ ఫీచర్లు

Tecno spark 9: భారత మార్కెట్లోకి టెక్నో తన కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. టెక్నో స్పార్క్ 9 పేరుతో తీసుకువచ్చిన ఈ కొత్త స్మార్ట్ ఫోన్ ధర రూ.9,499 మాత్రమే. ఈ ఫోన్ 6.6 అంగుళాల హెచ్ డీ ప్లస్ డిస్ప్లేను అందించారు. మీడియాటెక్ హీలియో జీ37 ఆక్టా-కోర్ ప్రాసెసర్ తో తీసుకువచ్చారు స్పార్క్ 9 ఫోన్ ను. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టం పై వస్తోంది.

వెనక డ్యూయల్ కెమెరాలు అందిస్తున్నారు. ముందు భాగం ఒక కెమెరా తీసుకువచ్చారు. కెమెరా విషయానికి వస్తే వెనక వైపు 13 మెగాపిక్సల్ క్వాలిటీతో ఫోటోలు అందించనుంది. సెల్ఫీల కోసం 8 మెగాపిక్సల్స్ తో ఫ్రంట్ కెమెరాను తీసుకువచ్చారు. బ్యాక్ కెమెరాలో ఏఐ ఎన్హాన్స్ డ్ ఇమేజ్ సిస్టంను అందించారు.

Advertisement

5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చింది టెక్నో స్పార్క్ 9. 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ అందిస్తున్నారు. డీటీెస్ స్పీకర్లు అందించారు. వాటర్ డ్రాప్ నాచ్ డిస్ ప్లే టెక్నో స్పార్క్ 9 సొంతం. ఇందులో 6జీబీ+128 జీబీ వంటి ఒకే మోడల్ లో ఈ ఫోన్ వస్తోంది. 512 జీబీ వరకు మెమోరీని పెంచుకోవచ్చు. ఈ ఫోన్ 5జీబీ వర్చువల్ ర్యామ్ కూడా ఆఫర్ చేస్తుంది. ప్రస్తుతం మార్కెట్ లో దొరికే రూ.10 వేల కంటే తక్కువ ఫోన్లలో మంచి ఫీచర్లు ఉన్నది ఈ టెక్నో స్పార్క్ 9కేనని టెక్ నిపుణులు చెబుతున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel