Karthika Deepam: శోభకి గోరుముద్దలు తినిపించిన సౌర్య.. శోభ చెంప చెల్లుమనిపించిన స్వప్న..?

Karthika Deepam: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో సౌర్య ఎలా అయినా మీ పెళ్లి జరిపిస్తాను అని నిరుపమ్ కి మాట ఇస్తుంది.

ఈరోజు ఎపిసోడ్ లో సౌందర్య హిమకు గోరింటాకు పెడుతూ మాట్లాడుతూ ఉండగా హిమ మాత్రం ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. ఇంతలోనే అక్కడికి ఆనందరావు వస్తాడు. అప్పుడు సౌర్యకు కూడా గోరింటాకు పెట్టు అని అనగా వెంటనే సౌందర్య దాన్ని కూడా పిలవండి అని అనడంతో వెంటనే ఆనందరావు, సౌర్యలేదు బయటకు వెళ్ళింది అని అంటాడు.

Advertisement

అప్పుడు హిమ ఎమోషనల్ అవ్వగా ఏమయింది హిమా అని అనడంతో బావకు, సౌర్య కి పెళ్లి చేద్దాం నానమ్మ అని హిమ అనడంతో వెంటనే సౌందర్య నీ వయసుకు మించిన ఆలోచనలు మానుకో పెద్దవాళ్ళం మేమున్నాము. ఏం చేయాలో మాకు తెలుసు అంటూ గట్టిగా అరవడంతో హిమ ఏడ్చుకుంటూ అక్కడ నుంచి వెళ్లిపోతుంది. మరొకవైపు స్వప్న శోభ కి ప్రేమగా అన్నం తినిపిస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి శౌర్య వస్తుంది. మీలాంటి అత్తా కోడల్ని నేను ఎప్పుడూ చూడలేదు అంటూ కాస్త వెటకారంగా మాట్లాడుతుంది సౌర్య.

ఇంతలోనే సత్య అక్కడికి వస్తాడు. సత్యను కూడా ఇన్వాల్వ్ చేస్తూ వెటకారంగా మాట్లాడడంతో వెంటనే సత్య ఫోన్ కాల్ వచ్చింది అని అబద్ధం చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సౌర్య, స్వప్న దగ్గర ఉన్న భోజనం ప్లేట్ తీసుకుని శోభకి బలవంతంగా అన్నం తినిపిస్తూ అత్తా కోడలు ఇద్దరికీ స్వీట్ గా వార్నింగ్ ఇస్తుంది.

ఆ తర్వాత శోభకు ఎక్కిళ్లు రావడంతో స్వప్న నీళ్లు తేవడానికి లోపలికి వెళ్ళగా అప్పుడు శోభ కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ తో మాట్లాడడంతో వెంటనే సౌర్య ప్లేట్లో ఉన్న అన్నాన్ని శోభ ముఖానికి రాసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరొకవైపు సౌందర్య ఇంట్లో పెళ్లి పనులు హడావిడిగా జరుగుతూ అందరూ రావడంతో సౌందర్య దంపతులు ఆనందంగా ఉంటారు. అప్పుడు సౌందర్య ఆనందరావు ఇద్దరు శౌర్య నిరుపమ్ కీ ఇచ్చిన మాట గురించి తలుచుకొని ఆనంద పడుతూ ఉంటారు.

Advertisement

మరొకవైపు నిరుపమ్ ఒంటరిగా కూర్చుని సౌర్య మనసు ఎంత మంచిది అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే స్వప్న అక్కడికి వస్తుంది. వెళ్లి రెడీ అవుపో నిరుపమ్ అని అనగా అప్పుడు నిరుపమ్ నేను రెడీ కాను అని అనడంతో వెంటనే స్వప్న చేతిలో ఒక లెటర్ పెట్టి ఇది చదివిన తర్వాత కూడా శోభను పెళ్లి చేసుకోను అంటే ఇంక నీ ఇష్టం అని అంటుంది. అప్పుడు నిరుపమ్ కూడా ఆ లెటర్ ని చదివి ఆశ్చర్యపోతాడు.

మరొకవైపు శౌర్య ఎక్కడికో వేగంగా వెళుతూ ఒక ఇంటి తలుపు తడుతుంది. మరోవైపు నిరుపమ్ స్వప్న చెప్పిన విధంగా పెళ్లి బట్టల్లో తయారయ్యి రావడంతో అది చూసి స్వప్న మురిసిపోతూ ఆనందపడుతూ ఉంటుంది. రేపటి ఎపిసోడ్ లో హిమ,శోభ నిరుపమ్ ల ఫోటో చూసి ఏడుస్తూ ఉండగా అప్పుడు సౌర్య ఏం కాదు అని చెప్పి సౌందర్య కుటుంబాన్ని స్వప్న ఇంటికి తీసుకుని వెళుతుంది. అప్పుడు స్వప్న ఒక్కసారిగా శోభ చెంప చెల్లుమనిపిస్తుంది.

Advertisement

Ramesh Babu

Senior Content Editor

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
Join our WhatsApp Channel