Karthika Deepam: సౌందర్య చేసిన పనికి కోపంతో రగిలిపోతున్న స్వప్న.. ఆనంద్ ని దూరం పెట్టాలి అనుకుంటున్నా జ్వాలా..?

Karthika Deepam: తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ రవ్వ ఇడ్లి కీ బాగాలేదు అని జ్వాలా,హిమ ను అక్కడికి వెళ్తుంది.

ఈరోజు ఎపిసోడ్ లో జ్వాలా, హిమ ఇద్దరు కలిసి రవ్వ ఇడ్లీ దగ్గరికి వెళ్తారు. అక్కడ దీన్ని చూసిన జ్వాల ఏమయింది ఏంటి ఈ దెబ్బలు అని అడగగా అప్పుడు రవ్వ ఇడ్లీ స్కూల్ లో గొడవ పడ్డాను అని చెప్పగా అప్పుడే జ్వాలా సీరియస్ అవుతుంది. స్కూల్ కి చదువుకోమని పంపిస్తే పోట్లాడి వస్తావా అని కసురుకుంది.

Advertisement

అప్పుడు ఆనంద్ స్కూల్లో నన్ను మా అమ్మానాన్నల గురించి అడిగి బాధ పెడుతున్నారు. మా అమ్మ నాన్న వీరే అంటూ కార్తీక్,మోనిత ల ఫోటోలు చూపిస్తాడు. ఆ ఫోటో ని చూసిన హిమ జ్వాలా ఒక్కసారిగా షాక్ అవుతారు. అప్పుడు హిమ ఎమోషనల్ అవుతూ దేవుడా ఇన్ని రోజులకు నన్ను నా తమ్ముడిని కలిపావా అని అనుకుంటూ ఉంటుంది.

కానీ జ్వాలా మాత్రంరవ్వ ఇడ్లీ అమృత ఆంటీ కొడుకు అవడం ఏంటి అని ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళిపోతుంది. ఆనంద్ అంటే ఆ హిమ కు చాలా ఇష్టం కదా. కాబట్టి తనకు ఇష్టమైన ఇది నాకు నచ్చదు అని ఆనంద్ పై కోపం పెంచుకుంటుంది. కానీ వరుసకు మాత్రమే నువ్వు నా తమ్ముడివి నేను నీకు అక్క అని పిలిచే అవకాశం ఇవ్వను అని మనసులో అనుకుంటుంది.

మరొకవైపు స్వప్న తన పెండ్ కి ఫోన్ చేసి మా మమ్మీ కి భయపడి నువ్వు రాఖీ కట్టించడం ఏంటి అని అడగగా.. మమ్మీ నన్ను బ్లాక్ మెయిల్ చేసింది అని చెబుతుంది. ఆ తర్వాత మరుసటి రోజు హిమ ఆనంద్ దగ్గరకి వెళ్తుంది. ఇప్పటినుంచి నువ్వు నన్ను అక్క అని పిలువు అని చెబుతుంది.

Advertisement

మరొకవైపు జ్వాలా సౌందర్యలు ఒకరికొకరు ఎదురు పడతారు. ఇద్దరూ కాసేపు ఫన్నీగా పోట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు జ్వాలా ఎలా అయినా సరే ఈ రోజు నానమ్మ ని ఫాలో అయ్యి ఆ హిమ ఎక్కడ ఉందో తెలుసుకోవాల్సిందే అని అంటుంది. అప్పుడు సౌందర్య అన్నీ బాగున్నాయి కానీ నీకు ఒకటే నాకు నచ్చదు అని అనగా నీ పోలికలే అని అంటుంది జ్వాలా. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel