Viral video: జూలో అమ్మాయికి చుక్కలు చూపించిన స్పైడర్ కోతి..!

Viral video: చాలా మంది జూ పార్కుకు వెళ్తుంటారు. అక్కడ రకరకాల జంతువలను చూసి ఆనందిస్తుంటారు. కొన్నింటిని ఎన్ క్లోజర్ లో ఉంచుతుంటారు. దూరం నుంచి మాత్రమే చూడాలని సిబ్బంది హెచ్చరిస్తుంటారు. అయినా కూడా కొంత మంది జూలోని ఎన్ క్లోజర్ వద్దకు వెళ్తుంటారు. అక్కడ బోనులో ఉన్న జంతువులను రాళ్లతో కొట్టడం, కర్రలతో గెలకడం చేస్తుంటారు. దీంతో చిరాకు పడ్డ అవి మనుషుల పైకి తిరగపడతాయి. కొన్నిసార్లు అవి చేసే దాడికి మనుషుల ప్రాణాలు కోల్పేయ అవకాశం కూడా ఉంటుంది. అందుకే జూ సిబ్బంది కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. కానీ తాజాగా ఓ అమ్మాయి ఓ స్పైడర్ కోతికి చిర్రెత్తుకొచ్చేలా చేసింది. అది ఇచ్చిన కౌంటర్ యాక్షన్ తో గంటల పాటు ఇబ్బంది పడాల్సి వచ్చింది.

ఓ అమ్మాయి బోనులో ఉన్న కోతి వద్దకు వెళ్లింది. అంతటితో ఆగకుండా ఎన్ క్లోజర్ దగ్గరకు వెళ్లి కోతి చేష్టలు వేసింది. దీంతో కోతకి చిర్రెత్తుకొచ్చి.. వెంటనే బోనులో జాలీ నుంచి తన చేత్లో అమ్మాయి జుట్టును పట్టుకుంది. యువతి మొత్తుకున్న జుట్టుని మాత్రం వదల్లేదు. కోతి చేతిలో నుంచి తన జుట్టును విడిపించుకోవడానికి అమ్మాయి నానా తంటాలు పడింది. అక్కడున్న కొందరు వచ్చి కోతిని విదిలిస్తే.. అప్పుడు అమ్మాయి జుట్టుని వదిలేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మీరూ ఓసారి చూసేయండి.

Advertisement

https://youtu.be/FK60bHWqd-w

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel