Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Power problems in hyderabad: మీ ఏరియాలో కరెంటు లేదా.. ఈ నెంబర్ కు కాల్ చేయండి!

Power problems in hyderabad: భాగ్యనగరంలో ఈ రోజు ఈదురు గాలులతో కురిసిన వర్షానికి పలు చోట్ల విద్యుత్ అంతరాయం ఏర్పడింది. అయితే ఉదయం నుంచి కరెంటు లేక నానా ఇబ్బందులు

By Vinod Kumar

Published on: May 4, 2022 12:59 PM

Updated on: May 4, 2022 1:47 PM

---Advertisement---

Power problems in hyderabad: భాగ్యనగరంలో ఈ రోజు ఈదురు గాలులతో కురిసిన వర్షానికి పలు చోట్ల విద్యుత్ అంతరాయం ఏర్పడింది. అయితే ఉదయం నుంచి కరెంటు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు పట్టణ వాసులు, అయితే చెట్లు కూలడం వల్లే విద్యుత్ సరపరాకు అంతరాయం ఏర్పడిందని దక్షిణ డిస్కం సీఎండీ రఘురామా రెడ్డి తెలిపారు. ఈ రోజు తెల్లవారుజామున నగరంలో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అయితే చాలా చోట్ల కరెంటు సమస్యలు ఉండటంతో రఘురామా రెడ్డి విద్యుత్ అధికారులతో ఆడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

Special ccontrol room numbers of electricity problems in hyderabad

Advertisement

విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది చెట్లను తొలగించి విద్యుత్ సరఫరా పునరుద్దరణ పనుల్లో ఉన్నారు. చెట్ల మీద వాహనాల మీద విద్యుత్ వైర్లు పడితే వాటిని తాకే ప్రయత్నం చేయొద్దని వివరించారు. రోడ్ల మీద నిల్వ ఉన్న నీళ్లలో విద్యుత్ వైర్లు గాని, ఇదర విద్యుత్ పరికరాలు మునిగి ఉంటే ఈ నీళ్లలోకి వెళ్లరాదని సూచించారు. అయితే విద్యుత్ సరఫరా సమస్యల పర్యవేక్షణ కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం. ఎలాంటి అత్యవసర పరిస్థితి ఉన్నా 112/100/ స్థానిక ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్ తో పాటు విద్యుత్ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ నంబర్లు 73820 72104, 73820 72106, 73820 71574లకు కాల్ చేసి ఫిర్యాదు చయొచ్చని రఘురామా రెడ్డి తెలిపారు.

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :