Space Radio Waves : అంతరిక్షంలో వింత శబ్దాలు.. ప్రతి 18 నిమిషాలకో రేడియో సిగ్నల్.. ఏలియన్స్ చేస్తున్నారా?

Space Radio Waves : అంతరిక్షంలో నుంచి వింత శబ్దాలు వస్తున్నాయి. ప్రతి 18 నిమిషాలకో రేడియో సిగ్నల్ వచ్చిపోతుంది.. ఏదో సంకేతాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది. అది ఏలియన్స్ ఏమైనా చేస్తున్నారా? అనే అనుమానం తలెత్తుతోంది. సైంటిస్టులకు ఆ రేడియో సిగ్నల్స్ ఎవరు పంపుతున్నారో అంతుపట్టడం లేదు.

ఏదో వింతైన వస్తువు అత్యంత శక్తివంతమైన రేడియో సిగ్నల్స్ విడుదల చేస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆ సంకేతాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో కనిపెట్టే పనిలో పడ్డారు ఖగోళ సైంటిస్టులు. ఆ వింత శబ్దాల సిగ్నల్స్ నిశితంగా గమనిస్తున్నారు. అదో కొత్త నూట్రాన్ స్టార్ కావొచ్చు అని అంటున్నారు. మన గెలాక్సీలో ఎన్నో రహాస్యాలు దాగి ఉన్నాయి.

ఎన్నో పరిశోధనలు చేపట్టిన ఇప్పటికీ అంతుపట్టని రహాస్యాలు సైంటిస్టులకు అంతుచిక్కడం లేదు. అంత‌రిక్షంలోని మిల్క్ వేవ్ నుంచి రేడియో సిగ్నల్స్ వస్తున్నాయని సైంటిస్టులు గుర్తించారు. సుమారు 4 వేల కాంతి సంవ‌త్స‌రాల దూరంలో మిల్క్ వేవ్ నుంచి ప్ర‌తి 18 నిమిషాల‌కు ఒక‌సారి రేడియో సిగ్నల్స్ రిలీజ్ చేస్తున్నట్టు సైంటిస్టులు కనుగొన్నారు.

Advertisement
space-radio-waves-blasting-out-radio-waves-for-every-18-minutes-from-space-is-aliens-sending-signals
space-radio-waves-blasting-out-radio-waves-for-every-18-minutes-from-space-is-aliens-sending-signals

అంతరిక్షంలో ఓ న‌క్ష‌త్రం నుంచి ఆ సిగ్నల్స్ వస్తున్నాయని గుర్తించారు. ఆస్ట్రేలియాలోని పెర్త్‌లోని కర్టిన్ యూనివర్శిటీలోని నటాషా హర్లీ-వాకర్, తోటి సైంటిస్టులతో రేడియో టెలిస్కోప్ ముర్చిసన్ వైడ్‌ఫీల్డ్ అర్రే (MWA) ద్వారా ఈ వస్తువును కనుగొన్నారు. అయితే అది కనిపించి వెంటనే అదృశ్యమైనట్లు కనుగొన్నారు. ఈ ఖగోళ అంత‌రిక్ష వ‌స్తువును మార్చి 2018లో తొలిసారిగా సైంటిస్టులు గుర్తించారు. ఆ స్టార్ రిలీజ్ చేసే రేడియో సిగ్నల్స్ భూమి నుంచి కూడా వీక్షించవచ్చునని అంటున్నారు.

Read Also : Mompha Junior Kid : ఓరీ బుడ్డోడా.. లగ్జరీ లైఫ్ అంటే నీదేరా.. ఎంతైనా రిచ్‌ కిడ్.. సూపర్ కార్లు.. ప్రైవేట్ జెట్.. లగ్జరీ హౌస్..!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ సబ్ ఎడిటర్‌గా ఉన్నాను. బ్రేకింగ్ న్యూస్, తెలంగాణ , ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, స్పోర్ట్స్, హెల్త్, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, మూవీలు, బిజినెస్ వార్తలను రాస్తుంటాను.

Join our WhatsApp Channel