Guppedantha Manasu july 20 Today Episode : అందరి ముందు అడ్డంగా దొరికిపోయిన సాక్షి.. సాక్షిని ఒక రేంజ్ లో ఆటాడుకున్న గౌతమ్, వసు..?

Guppedantha Manasu july 20 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రిషి, వసు ఇద్దరూ ఒకరికొకరు ఎదురుపడి మాట్లాడుకుంటూ ఉంటారు. ఈరోజు ఎపిసోడ్ లో వసు, రిషి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే అక్కడికి జగతి దంపతులు రావడంతో వెంటనే రిషి టాపిక్ డైవర్ట్ చేసి మాట్లాడి ఎక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత మహేంద్ర కొద్దిసేపు జగతిని ఆటపట్టించే విధంగా మాట్లాడుతాడు. ఆ తర్వాత రిషి అడ్డుగా వెళ్తూ క్లాసులో బోర్డుపై వేసిన బొమ్మను చూసి ఆ బొమ్మని ఖచ్చితంగా వసుధార వేసింది అనుకుంటాడు.

Guppedantha Manasu july 20 Today Episode : Sakshi invites Rishi for lunch with an evil motive in todays guppedantha manasu serial episode
Guppedantha Manasu july 20 Today Episode : Sakshi invites Rishi for lunch with an evil motive in todays guppedantha manasu serial episode

ఇంతలోనే వసు ఆ బొమ్మని వేస్తూ ఉన్నట్లుగా ఊహించుకుంటాడు. ఆ తర్వాత ఆ బొమ్మని ఫోటో తీసుకుని ఇక నుంచి వెళ్ళిపోతూ ఉండగా సాక్షి ఎదురుపడి మాట్లాడాలి అని చెప్పి నేను నిన్ను ప్రేమించాను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను కానీ అది జరగదు అని అర్థమయింది. కనీసం ఒక ఫ్రెండులా ఆయన నాతో ఉంటావా అని మాట్లాడుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి వసు వచ్చి వారిద్దరి మాటలు వింటూ ఉంటుంది.

Guppedantha Manasu  : గుప్పెడంత మనసు సీరియల్.. సాక్షిని ఒక రేంజ్ లో ఆటాడుకున్న గౌతమ్, వసు…

అప్పుడు సాక్షి రిషి ని వాళ్ళ ఇంటికి భోజనానికి ఇన్వైట్ చేయగా వసుధార నో చెప్పు, నో చెప్పండి సార్ అని మనసులో అనుకుంటూ ఉండగా రిషి సరే అని అనడంతో వసు ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆ తర్వాత సాక్షి, రిషి వస్తాడు అన్న ఆనందంలో బాగా రెడీ అయ్యి దేవయానికి ఫోన్ చేసి చెప్పడంతో దేవయాని కీ సాక్షికి ఆల్ ది బెస్ట్ చెబుతుంది. ఇంతలోనే రిషి రావడంతో ఆనందంగా వెళ్లి రిసీవ్ చేసుకుంటుంది. అప్పుడు రిషి ని లోపలికి రమ్మని పిలవగా నేను ఒక్కటే కాదు అని అనగా వెంటనే అక్కడికి జగతి,గౌతమ్,మహేంద్ర వాళ్లు రావడంతో సాక్షి ఒక్కసారిగా షాక్ అవుతుంది.

Advertisement

ఆ తరువాత వసుధార కూడా ఎంట్రీ ఇవ్వడంతో మరింత షాక్ అవుతుంది సాక్షి. ఇక అందరూ కలిసి లోపలికి వెళ్లిన తర్వాత సాక్షి నేను ఇద్దరికీ మాత్రమే ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేశాను ఇంతమంది వచ్చారు ఎలా అని అనుకుంటూ ఉంటుంది. కానీ గౌతమ్ మాత్రం కిచెన్ ఎక్కడ ఉంది అంటూ హోటల్లో మెనూ చెప్పినట్టుగా పెద్ద మెనూ చెప్పడంతో సాక్షి టెన్షన్ పడుతూ ఉంటుంది. సాక్షి టెన్షన్ ను గమనించిన గౌతమ్ మధ్యలో వసుధార ను కూడా అడగగా వసు,గౌతమ్ ఇద్దరు కలిసి సాక్షిని ఒక రేంజ్ లో ఆటాడుకుంటారు.

అప్పుడు సాక్షి వారి మాటలకు చెప్పలేక టెన్షన్ పడుతూ ఉంటుంది.. ఇంతలోనే ఫుడ్ డెలివరీ బాయ్ వచ్చి ఫుడ్ డెలివరీ ఇవ్వడంతో సాక్షి అందరి ముందు అడ్డంగా బుక్ అవుతుంది. కనీసం కిచెన్ లో కూడా ఏమి ఉన్నాయో లేవో తెలియదు అనటంతో అందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు వసు నేను హెల్ప్ చేస్తాను అని చెప్పి కిచెన్ లోకి వెళ్తుంది. అప్పుడు సాక్షి తప్పించుకోవడానికి మాటల్లో పెడుతుంది.

కిచెన్ లో ఏమి లేవు కాబట్టి వసు పరువు మొత్తం పోతుంది అని అనుకుంటూ ఉంటుంది. రేపటి ఎపిసోడ్ లో వసు రిషి ఇద్దరు కారులో వెళ్తూ ఉండగా అప్పుడు వసుధార సాక్షి విషయంలో మీ అభిప్రాయం ఏంటి సార్ అని అడుగుతుంది. అప్పుడు ఏమీ లేదు ఎందుకు అలా అడిగావు అని అడగగా.. వెంటనే వసు, సాక్షి చెప్పిన మాటలకు మీరు సరే అంటున్నారు అని అనగా వెంటనే రిషి నా సంగతి పక్కన పెట్టు నువ్వు ఎందుకు నా మెడలో పూలదండ వేసావు అని అడుగుతాడు. అప్పుడు నాకు సమాధానం కావాలి అనడంతో వసుధార తన మనసులో మాట చెప్పడానికి టెన్షన్ పడుతూ ఉంటుంది.

Advertisement

Read Also :  Guppedantha Manasu july 19 Today Episode : వసుధారని పొగిడిన రిషి.. సాక్షికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన రిషి..?

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 Telugu News And Updates Breaking News All over World

RELATED POSTS

Join our WhatsApp Channel