Guppedantha Manasu july 25 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. రిషి,మహేంద్ర, గౌతమ్ ముగ్గురు చదువుల పండుగ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఈరోజు ఎపిసోడ్లో దేవయాని, మహేంద్ర దంపతులు గౌతమ్ కూర్చొని కాఫీ తాగుతూ ఉంటారు. అప్పుడు మహేంద్ర ఈరోజు కాఫీ చాలా బాగుంది అంటూ ధరణిని పొగుడుతూ ఏంటమ్మా ధరణి ఈ మార్పు అని అనగా వెంటనే దేవయాని జగతి, ధరణిలను ఉద్దేశిస్తూ ఈ మధ్యకాలంలో చాలా మార్పులు వచ్చాయిలే మహేంద్ర అంటూ వెటకారంగా మాట్లాడుతుంది. వెంటనే మహేంద్ర దంపతులు ఇద్దరు దేవయానికి స్ట్రాంగ్ గా కౌంటర్ ఇస్తారు.

అప్పుడు ధరణి కూడా చిన్నచిన్నగానే దేవయాని పై కౌంటర్లు వేయడంతో మహేంద్ర దంపతులు నవ్వుకుంటూ ఉంటారు. ఆ తర్వాత వసు కాలేజీ లోపలికి వెళుతూ చదువుల పండుగను ఎలా అయినా సక్సెస్ చేయాలి అని అనుకుంటూ, రిషి గురించి ఆలోచిస్తూ మురిసిపోతూ ఉంటుంది. మరొకవైపు సాక్షి దేవయానికి ఫోన్ చేసి నేను ఇప్పుడే కాలేజీ కి వచ్చాను ఆల్ ది బెస్ట్ చెప్పండి ఆంటీ అని అంటుంది. ఆ తర్వాత వసు వాచ్మెన్ ను అడిగి స్టోర్ రూమ్ కి వెళ్తుంది. అప్పటికే రిషి స్టోర్ రూమ్ లో వస్తువు గురించి వెతుకుతూ ఉండగా ఇంతలో వసుధర రావడంతో వాచ్మెన్ అనుకొని ఏంటి వాచ్మెన్ ఇప్పుడు ఆ వచ్చేది ఆ కత్తిరి ఇలా ఇవ్వు అని అంటాడు. అప్పుడు ఆ సరే సార్ అని వసుధర అనడంతో వెంటనే వెనక్కి తిరిగి ఏంటి నువ్వు ఇక్కడ ఉన్నావు అని అడగగా వసుధార కూడా మీరేంటి సార్ ఇక్కడ ఉన్నారు అంటూ ఎదురు ప్రశ్నిస్తుంది.
Guppedantha Manasu : ఒకే వలలో చిక్కుకున్న వసు, రిషి..

అలా వారిద్దరూ కామెడీగా మాట్లాడుకున్న తర్వాత అనుకోకుండా వసుధార పడిపోతూ ఉండగా రిషి పట్టుకుంటాడు. అప్పుడు వారిద్దరూ ఒకే వలలో చిక్కుకోవడంతో కావాలని విడిపించుకుంటూ ఉండగా సాక్షి ఆ వీడియోని తీస్తూ మీ పని అయిపోయింది అని అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత వసుధర ఏం జరిగింది సార్ అని అనగా నువ్వు రావడంతో ఈ స్టోర్ రూమ్ పరిస్థితిని మొత్తం ఆరిపోయాయి అంటాడు. ఆ తర్వాత సాక్షి జరిగింది మొత్తం ఇందులో రికార్డు చేశాను అని నవ్వుకుంటూ ఉండగా ఇంతలోనే మహేంద్ర దంపతులు కాలేజీకి వస్తారు. అప్పుడు సాక్షి వాళ్ళని చూసి ఎదురు వెళ్లి పలకరించి ఓవర్ కాన్ఫిడెన్స్ తో మాట్లాడడంతో వెంటనే జగతి కౌంటర్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత రిషి ఎందుకు అనవసరమైన పనులు చేసుకుంటూ ఆరోగ్య ని పాడు చేసుకుంటావు అని అనగా వెంటనే వసుధార చదువులు పండుకున్న చాలా గ్రాండ్గా చేయాలి అనుకుంటున్నాను సార్ అందుకే ఇలా చేస్తున్నాను అని అంటుంది.
చదువుల పండుగ కోసం ఒక జెండా తయారు చేశాను అని అనగా ఏంటి నువ్వు నీ అంతట నువ్వే నిర్ణయాలు తీసుకుంటావా నన్ను అడగవా అని అనగా వెంటనే వసు మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వరు కలిసి మాట్లాడదామంటే టైం ఉండదు ఎలా చెప్పాలి సార్ అని అనడంతో వెంటనే రిషి మౌనంగా ఉంటాడు.. అప్పుడు వరదరా తాను డిజైన్ చేసిన ఫ్లాగ్ చూపించబోతూ ఉండగా రిషి సేమ్ అలాంటి జెండానే చూపించడంతో మీరు నా ఆలోచనలని కాపీ కొట్టారు కదా అంటూ రిషితో వాదిస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి జగతి దంపతులు వస్తారు. ఆ తర్వాత మహేంద్ర, జగతి లకు పని అప్పజెప్పి ఎక్కడ నుంచి వెళ్లిపోతారు రిషి. రేపటి ఎపిసోడ్ లో రిషి,వసుని పెన్ డ్రైవ్ గురించి అడగగా కనపడటం లేదు అనడంతో వెంటనే సాక్షి కావాలనే వస్తారని ఇరికించాలి అని ఇలా బాధ్యత లేని వారికీ చదువుల పండుగ గురించి అప్పగిస్తే ఏం చేస్తారు ఇలాంటి వారికి వెంటనే పనిష్మెంట్ ఇవ్వాలి అని అనగా వెంటనే రిషి అవును సాక్షి తప్పకుండా పనిష్మెంట్ ఇస్తాను అని అంటాడు.
Read Also : Guppedantha Manasu July 23 Today Episode : ఒకే వలలో చిక్కుకున్న వసు, రిషి.. వీడియో తీసిన సాక్షి..?
- Guppedantha Manasu: దగ్గరైన వసు, రిషి..సరికొత్త ప్లాన్ వేసిన దేవయాని..?
- Guppedantha Manasu june 23 Today Episode : వసు జ్ఞాపకాలతో సతమతమౌతున్న రిషి.. దేవయాని మాటలకు బాధపడుతున్న జగతి, మహేంద్ర..?
- Guppedantha Manasu june 20 Today Episode : సాక్షి నుంచి రిషిని కాపాడిన వసుధార.. అడ్డంగా దొరికిపోయిన సాక్షి!













