Guppedantha Manasu: సాక్షికి గట్టిగా కౌంటర్ ఇచ్చిన జగతి.. సాక్షిపై కోప్పడిన రిషి..?

Guppedantha Manasu: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో జగతి, వసుకీ ఫోన్ చేసి రిషి విషయం గురించి చెప్పడంతో వసుధార ఒక్కసారిగా ఎమోషనల్ అవుతుంది.

ఈరోజు ఎపిసోడ్ లో వసు, రిషి ఇద్దరూ రెస్టారెంట్ లో కూర్చుని ఒకరి వైపు ఒకటి చూసుకుంటూ ఉంటారు. అప్పుడు వసు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండడంతో రిషి ఏంటి అలా ఉన్నావు అని అనగా నాకు చాలా మాట్లాడాలని ఉంది సార్ కానీ ఎలా మొదలు పెట్టాలో అర్థం కావడం లేదు అని అనడంతో వెంటనే పర్లేదు చెప్పు అని అంటాడు రిషి. అప్పుడు వసు మీ నిర్ణయం మార్చుకుంటే బాగుంటుంది అని అంటుంది.

Advertisement

అప్పుడు వసు, రిషి నిర్ణయం గురించి కాస్త ఎమోషనల్ గా మాట్లాడుతుంది. అప్పుడు రిషి తాను ప్రపోజ్ చేసిన విషయం గురించి తలుచుకొని బాధపడి మాట్లాడి ఎక్కడ నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత వసుధార కూడా రిషి నిర్ణయం గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. మరొకవైపు రిషి ఒంటరిగా ఉండగా ఇంతలోనే సాక్షి అక్కడికి వచ్చి సంతోష పడుతూ ఉంటుంది. పెళ్లికి ఒప్పుకున్నందుకు సంతోషంగా మాట్లాడుతూ ఉంటుంది.

అప్పుడు సాక్షి రింగుల గురించి మాట్లాడటంతో రిషి మాత్రం ఏం మాట్లాడకుండా మౌనంగా సరే అని అంటాడు. అప్పుడు సాక్షి షాపింగ్ చేద్దామా అని అనగా వెంటనే రిషితాను రాను అని అంటాడు. కానీ సాక్షి మాత్రం వినకుండా అదొక స్వీట్ మెమోరీలా ఉంటుంది వెళ్దాం అని అనగా నాకు గంటలకు ఉంది షాపింగ్ చేయడం నచ్చదు అని గట్టిగా అంటారు రిషి.

వెంటనే సాక్షి,రిషి, వసుకీ తెచ్చిన బట్టల విషయం గుర్తు తెచ్చుకొని ఎందుకు రిషి ఈ విధంగా మాట్లాడుతున్నాడు అని ఆలోచనలో పడుతుంది. అప్పుడు రిషి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా జగతి అక్కడికి వస్తుంది. అప్పుడు రిషి ఏం మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు సాక్షి వెళ్లి కొంచెం ఓవర్గా మాట్లాడడంతో వెంటనే జగతి తన స్టైల్ లో సాక్షికి గట్టిగా కౌంటర్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

Advertisement

మరొకవైపు రిషి ఒంటరిగా కూర్చుని వసుధార ఇచ్చిన గిఫ్ట్ ను చూస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి మహేంద్ర వస్తాడు. అప్పుడు మహేంద్ర, తిషితో ఎమోషనల్ గా మాట్లాడుతూ ఒకప్పుడు మంచి ఫ్రెండ్స్ గా ఉండే వాళ్ళం ఇప్పుడు అలా ఉండటం లేదు అని అంటాడు. అప్పుడు రిషి నిర్ణయం గురించి అడగగా రిషి మాత్రం ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. అప్పుడు మహేంద్ర వర్మ వసు గురించి అడగగా రిషి ఆశ్చర్యపోతాడు.

ఆ తర్వాత రిషి నేను అన్ని ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను అని అంటాడు. దీంతో మహేంద్ర ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోవడంతో రిషి బాధపడుతూ ఉంటాడు. మరొకవైపు వసుధార అమ్మవారి దగ్గరికి వెళ్లి బాగా ఎమోషనల్ గా మాట్లాడుతుంది. రిషి నిర్ణయం గురించి అమ్మవారికి చెప్పుకొని బాధపడుతూ ఉంటుంది.

మరొకవైపు సాక్షి దేవయాని ఇద్దరు సంతోషంగా మాట్లాడుతూ ఉండగా ఇంతలోనే దేవయాని సాక్షితో నీ కోరిక తీరింది కదా అని అనగా వెంటనే సాక్షి మాత్రం రిషి తనతో సరిగా మాట్లాడటం లేదు అని అంటుంది. ఇప్పుడు దేవయాని మాత్రం రిషి మనసులో స్థానం సంపాదించుకునే ప్రయత్నం చేయి అంటూ సాక్షికి లేనిపోని ఐడియాలు ఇస్తుంది. ఆ తర్వాత రిషి ఫోన్లో వసుధార ఫోటోలు చూస్తూ ఉండగా ఇంతలోనే సాక్షి అక్కడికి వచ్చి రిషి ఫోన్ లాక్కొని నానా గొడవ చేస్తుంది.

Advertisement

దాంతో రిషి, సాక్షిపై కోప్పడుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి దేవయాని వచ్చి సాక్షిని పిలుచుకొని వెళ్తుంది. అప్పుడు దేవయాని,సాక్షిని బయటకు తీసుకుని వస్తూ ఉండగా ఇంతలోనే వసుధార, జగతి ఇద్దరు ఎదురుపడతారు. అప్పుడు సాక్షి మరింత కోపంతో వసుధార పై అరుస్తూ అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అంటుంది. అసలు నిన్ను అనాలి ఇదంతా నీ వల్లే జరుగుతుంది. నా జీవితమంతా నీ వల్లే డిస్టర్బ్ అయ్యింది ఇక్కడి నుంచి వెళ్ళిపో వసుధర అని అనడంతో ఇంతలోనే రిషి అక్కడికి వస్తాడు.

Ramesh Babu

Senior Content Editor

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
Join our WhatsApp Channel