Saffron Flag : ఎర్రకోటపై కాషాయం జెండా ఎగరేస్తాం- మంత్రి

Saffron Flag : కర్ణాటకకు చెందిన ఓ బీజేపీ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఆయన జాతీయ జెండాపై కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న రోజుల్లో దేశ జాతీయ జెండాను మార్చేస్తామని అన్నారు. ఈ వ్యాఖ్యలు చేసింది కర్ణాటక మంత్రి కేఎస్ ఈశ్వరప్ప. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న హిజాబ్ ఇష్యూ పై మాట్లాడిని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈశ్వరప్ప చెప్పిన దాని ప్రకారం తాము అధికారంలో ఉండగా ఇప్పడు ఉన్న మూడు రంగుల జెండాన్ని ఏకంగా కాషాయ జెండాగా మార్చేస్తామని తెలిపారు. అలా చేయగల సత్తా బీజేీపికి ఉందని తాను విశ్వసిస్తున్నట్లు తెలిపారు. దీనితో పాటు హిందుత్వం అనే భావ జాలాన్ని విస్తరించబోతన్నట్లు నిగూఢంగా చెప్పారు.

ఇదిలా ఉంటే గతంలో జరిగిన దానిని కూడా ఈ క్రమంలో గుర్తు చేశారు ఈశ్వరప్ప. రామ మందిరానికి సంబంధించి కూడా చాలామంది తమను తక్కువగా మాట్లాడారని అన్నారు. అయితే తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఉత్తర్​ ప్రదేశ్​ లోని అయోధ్యలో శ్రీ రామునికి మందిరం నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. అందుకు తమ పార్టీని తక్కువ అంచనా వేయవద్దని అన్నారు. రామ మందిరం పై ఎలా అయితే ముందుకు వెళ్లామో… ఇదే విధంగా జాతీయ జెండాను కూడా కాషాయ జెండా మార్చి దిల్లీలోని రెడ్ ఫోర్టుపై ఎగురువేస్తామని స్పష్టం చేశారు.

Saffron Flag May Become National Flag In Future
Saffron Flag May Become National Flag In Future

ఈయన చేసిన వ్యాఖ్యలపై లౌకిక వాదులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అంతేగాకుండా తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు. ఓ రాష్ట్రానికి మంత్రి స్థాయిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. రాజ్యాంగబద్ద హోదాలో ఉండి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కచ్చితంగా రాజ్యాంగ విరుద్దం అని అంటున్నారు. మంత్రి చేసిన వ్యాఖ్యలను వెంటనే వాపసు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Advertisement

ఇదిలా ఉండే కర్ణాటకలో రాజుకున్న హిజాబ్ వ్యవహారంపై పెద్ద రచ్చకు దారి తీసింది. దీంతో బొమ్మై సర్కార్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్నీ పాఠశాలలకు సెలవు ప్రకటించింది. కానీ దేశ వ్యాప్తంగా హిజాబ్​ వర్సెస్ కాషాయంగా మారిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Read Also : Karthika Deepam Feb 10 Episode : సూపర్ క్లైమాక్స్.. సౌందర్య ఎంట్రీతో రుద్రాణికి చెక్..! మండిపోతున్న మోనిత..!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 Telugu News And Updates Breaking News All over World

Join our WhatsApp Channel