Guppedantha Manasu March 7th Today Episode : బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగింది ఇప్పుడు తెలుసుకుందాం.. వసు, రిషి కోసం కాలేజ్ దగ్గర ఎదురుచూస్తూ ఉంటుంది. ఇంతలో రిషి వస్తాడు. ఇక ఆనందంలో వెంటనే వసు, రిషి వద్దకు వెళ్లగా ఏంటి ఇంత తొందరగా వచ్చావు అని ప్రశ్నించగా?అప్పుడు వసు కూడా మీరు కూడా ఎందుకు ఇంత తొందరగా వచ్చారు అని అడుగుతుంది.
అప్పుడు రిషి నాకంటూ వేరే ప్రపంచం అంటూ ఏం ఉంటుంది అని అంటాడు. ఇక జగతి కాలేజ్ కి వస్తుంది. ఆ విషయాన్ని తెలుసుకున్న మహేంద్ర కూడా కాలేజీకి వస్తారు. రిషి మాట్లాడుతూ వసుధార ఇప్పుడు నన్ను ఏమి అడగకు అని అక్కడనుంచి వెళ్ళి పోతాడు. అప్పుడే రిషి, జగతి ఇద్దరూ ఒకరికొకరు ఎదురు పడగా, దూరం నుంచి వారిద్దరిని మహేంద్ర, వసు గమనిస్తూ ఉంటారు.

అప్పుడు జగతి జరిగిన దాన్ని తలచుకుని బాధ పడుతూ ఉంటుంది. ఇంతలో మహేంద్ర, వసు అక్కడికి వస్తారు. అప్పుడు మహేంద్ర మాట్లాడుతూ థాంక్స్ జగతి.. జరిగినదానికి రావేమో అనుకున్న భయపడ్డాను అని అంటాడు. అప్పుడు వసుధార, రిషి, జగతి ని చూసి ఇద్దరూ ఒకటే.. ఇద్దరి మనస్తత్వాలు కూడా ఒకటే అని అనుకుంటూ ఉంటుంది.
ఇక వసుధార క్లాస్ లోపలికి వెళ్లగానే పుష్ప తన ఇంట్లో జరిగిన విషయం గురించి చెబుతూ ఉంటుంది. కానీ వసు మాత్రం పుష్ప మాటలు పట్టించుకోకుండా రిషి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. రిషి మనసు బాగు చేయడం కోసం రిషి కథ ప్రిన్స్, రాకుమారుడు అంటూ ఇన్ డైరెక్టుగా చెబుతుండగా.. అప్పుడు రిషి నా గురించి కథలు చెబుతున్నావు నీకు చులకన అయ్యాను అంటూ వసు ఫై సీరియస్ అవుతాడు.
నా సమస్య నాది నీకు ఎలాంటి సంబంధం లేదు అంటాడు. ఇంతలో అక్కడికి గౌతమ్ వస్తాడు. రిషి పెద్దమ్మ భోజనం పంపింది తిందాం రా అని పిలుస్తాడు. అప్పుడు రిషి నాకు భోజనం వద్దు అంటాడు. అప్పుడు గౌతమ్ సరే వసుధార మరి ఇద్దరం కలిసి భోజనం చేద్దాం అని అనగా.
అప్పుడు రిషి వద్దులే మనిద్దరం తిందాం పదా అని అంటాడు.మరోవైపు జగతి జరిగిన విషయాన్ని తెలుసుకొని బాధపడుతూ ఉంటుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Read Also : Karthika Deepam March 7th Today Episode : చివరి రోజు అన్న కార్తీక్ .. బోరున ఏడ్చేసిన సౌందర్య..?
- Guppedantha Manasu january 19 Today Episode : వసుధారపై సీరియస్ అయిన రిషి.. సుమిత్రని జాగ్రత్తగా చూసుకుంటున్న చక్రపాణి.?
- Guppedantha Manasu Nov 3 Today Episode : ఏకాంతంగా గడుపుతున్న వసుధార రిషి.. ధరణి మాటలకు ఆశ్చర్యపోయిన దేవయాని..?
- Guppedantha Manasu january 11 Today Episode : జగతికి థాంక్స్ చెప్పిన రిషి.. బాధతో కుమిలిపోతున్న జగతి..?













