Guppedantha Manasu: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. గత ఎపిసోడ్ లో వసు బొమ్మ చిరిగి పోయినందుకు బాధపడుతూ ఎలా అయినా ఆ బొమ్మ గీసిన వ్యక్తిని వెతికి పట్టుకుంటాను అని అంటుంది.
ఈరోజు ఎపిసోడ్ లో వసు రెస్టారెంట్ లో ఉండగా అక్కడికి ఒక చిన్న పిల్లవాడి తో రిషి బొమ్మను పంపగా అది చూసిన వసు ఆనందంతో మురిసి పోతూ ఉంటుంది. ఆ బొమ్మను తీసుకు వచ్చిన పిల్లాడు అక్కడే ఉన్నాడని చెప్పడంతో అతను ఎవరో అడగాలి అని అక్కడికి వెళుతుంది వసు.

అప్పుడు రిషి తన గురించి ఎక్కడ నిజం తెలిసిపోతుంది అని భయపడుతూ ఉంటాడు. ఎలాగో అలాగా వసు నుంచి తప్పించుకుంటాడు. మరొకవైపు జగతి గదిలో ఒంటరిగా ఉండగా అక్కడికి సాక్షి వెళ్తుంది. దారిలో వెళ్తున్నానని అందుకే రిషిని కలుద్దామని వచ్చాను అని అంటూ,తనను ఎవరు అర్థం చేసుకోరు అని.. కానీ నేను అందర్నీ అర్థం చేసుకుంటాను అని అంటుంది.
అప్పుడు జగతి.. నిన్ను అర్థం చేసుకోవడం లేదు అంటే అది నీ లోపం అని అంటుంది. అంతేకాకుండా రిషి కోసం ఎప్పుడుపడితే అప్పుడు ఇలా రావడం కరెక్ట్ కాదు మరి ఉదయం వచ్చినప్పుడు మాట్లాడకపోతే ఏం చేయాలి అని అడుగగా అప్పుడు జగతి నేరుగా రావడం మానేశాయ్ అని అంటుంది.
ఆ తర్వాత రిషి, వసు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో పూలు అమ్ముకునే ఆవిడ అక్కడికి రావడంతో వసు పూలు తీసుకోవడానికి రిషి నిరాకరిస్తాడు.
ఆ తర్వాత వసు ఆ బొమ్మ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. రెస్టారెంట్ లో రిషి ప్రవర్తన గుర్తుకు తెచ్చుకొని ఆ బొమ్మ రిషి నే గీసాడేమో అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు రిషి వసు కి ఎదురుకావడంతో వసు,రిషిని పట్టించుకోకుండా ఆ బొమ్మ గురించి ఆలోచిస్తూ ఉంటుంది.
అప్పుడు బొమ్మ గీసిన వాళ్ళు ఎదురు పడితే ఏం చేస్తావు అనటంతో వెంటనే కౌగిలించుకొని థాంక్స్ చెబుతాను అని రిషిని కౌగిలించుకొని చూపిస్తుంది. ఒకవేళ నేనే గీసినట్లయితే ఏం చేస్తావు అనటంతో.. వెటకారంగా నవ్వుతూ మీరా అన్నట్లు మాట్లాడుతుంది వసు. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
- Guppedantha Manasu November 19 Today Episode : వసు విషయంలో సరికొత్త ప్లాన్ వేసిన దేవయాని.. బాధతో కుమిలిపోతున్న జగతి..?
- Guppedantha Manasu june 15 Today Episode : సాక్షికీ గట్టిగా బుద్దిచెప్పిన వసు..వసు మాటలకు ఆశ్చర్యపోయిన రిషి..?
- Guppedantha Manasu: సాక్షిని అసహ్యించుకున్న రిషి.. రిషి విషయం గురించి ఎమోషనల్ అవుతున్న జగతి, మహేంద్ర..?















