Redmi Note 11pro+: తక్కువ ధరలో అదిరిపోయే ఫీచర్స్ తో మార్కెట్ లోకి విడుదల కానున్న రెడ్ మీ నోట్ 11 ప్రో.. ధర ఎంత అంటే?

Updated on: March 12, 2022

Redmi Note 11pro+: ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ కి ఎంతో డిమాండ్ వుంది. ఈ క్రమంలోనే రోజురోజుకు వినియోగదారులకు సరికొత్త అధునాతనమైన ఫీచర్ ద్వారా ఎన్నో రకాల ఫోన్లు మార్కెట్లోకి విడుదల అవుతున్నాయి. ఈ క్రమంలోనే భారతదేశంలోకి మరికొన్ని రోజులలో 5జీ నెట్వర్క్ అందుబాటులోకి రానున్న నేపథ్యంలో ఇప్పటికే పలు కంపెనీలు 5జీ స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. తాజాగా రెడ్‌మీ మరో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. Redmi Note 11 Pro+ పేరుతో కొత్త 5జీ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. మార్చి 10వ తేదీన మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది మరి ఈ ఫోన్ ధర ఎంత ఇందులో ఉన్న ఫీచర్స్ ఏమిటి అనే విషయానికి వస్తే….

Redmi Note 11 Pro+ ఫోన్‌ ఫీచర్స్ విషయానికి వస్తే 108 మెగా పిక్సెల్‌ రెయిర్‌ కెమెరా, సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను అందించారు. ఇక ఛార్జింగ్‌కు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ప్రో గ్రేడ్‌ 67 వాట్స్‌ టర్బో ఛార్జ్‌ టెక్నాలజీని అందించారు. డిస్‌ప్లే 6.67 ఇంచెస్‌ 120హెడ్జ్‌ సూపర్‌ ఆమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు.

5జీ నెట్వర్క్ కోసం ఈ ఫోన్లో అధునాతనమైన ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ ఫోన్  6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ను అందించారు. ఇక ఎన్నో అధునాతనమైన ఫీచర్లను కలిగి ఉన్న ఈ ఫోన్ ధర విషయానికి వస్తే 20 వేల రూపాయలతో ఈ ఫోన్ ధరలు ప్రారంభంకానున్నాయి. ఈనెల 10వ తేదీ మార్కెట్లోకి విడుదలైన ఈ ఫోన్స్ త్వరలోనే ఈ కామర్స్ వెబ్సైట్లో కూడా అందుబాటులోకి రానుంది.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel