Karthika Deepam: నిరుపమ్ విషయం గురించి బాధ పడుతున్న స్వప్న.. అమెరికా వెళ్లాలి అనుకుంటున్న నిరుపమ్..?

Karthika Deepam: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న కార్తీక దీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో సత్య ఇంటికి శోభ, స్వప్న ఇద్దరు వస్తారు.

ఈరోజు ఎపిసోడ్ లో సత్య, రేపటి నుంచి నుంచి భక్తులు తీసుకురావడం ఆపేయ్ అమ్మ అన్ని జ్వాలా కి చెబుతాడు. ఆ తర్వాత జ్వాల అక్కడినుంచి బాధపడుతూ వెళ్ళి పోతూ ఉండగా ఇంతలో అక్కడికి హిమ వస్తుంది. జ్వాల నీ అక్కడ చూసిన హిమ ఏంటి ఇక్కడ ఉన్నావ్ అని అడగగా జ్వాలా జరిగినదంతా వివరిస్తుంది.

Advertisement

వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి శోభ వస్తుంది. అప్పుడు శోభ మీరిద్దరూ చేయలేనిది నేను చేశాను. వాళ్ల కుటుంబాన్ని కలిపాను ఆ కుటుంబానికే కోడలిగా వెళతాను అని అంటుంది. దాంతో వాళ్ళిద్దరూ ఒకసారిగా షాక్ అవుతారు. ఇంతలోనే అక్కడికి స్వప్న వచ్చి త్వరలోనే మా కుటుంబంలో ఒకటి కాబోతుంది అని అంటుంది.

అప్పుడు జ్వాలా ని నానారకాలు మాటలు అని అవమాన పరుస్తుంది. అప్పుడు జ్వాలా డాక్టర్ సాబ్ మనసులో నేనే ఉన్నాను ఎవరు ఎన్ని చాలెంజ్ లు చేసిన మనకేం భయం లేదు అని హిమ కు ధైర్యం చెబుతుంది. అప్పుడు హిమ అసలు నిజాన్ని నీకు ఎలా చెప్పాలి అని లోపల బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత స్వప్న, శోభ ఇద్దరూ కారులో వెళుతుండగా జ్వాలా, హిమ మాట్లాడుతుండటం చూస్తారు.

అప్పుడు ఇక స్వప్న ఒకవైపు హిమ.. రెండోవైపు జ్వాల నిరుపమ్ కి పీడలా దాపరించారు అని అంటుంది. మరోవైపు నిరూపమ్, హిమ నన్ను ఎందుకు కాదన్నదో తెల్చేస్తాను అని అనుకుంటాడు. అప్పుడు జ్వాల అవును తింగరి నువ్వు నిజంగానే మమ్మల్ని కలపడానికి వచ్చావా లేక విడగొట్టడానికి వచ్చావా అని అనడంతో అదే మాట అని అంటుంది హిమ.

Advertisement

ఇక ఇద్దరు లవర్స్ మధ్య మూడో మనిషి ఉండకూడదని.. నీకు తెలియదా తింగరి అని జ్వాల అంటుంది. అయినా నువ్వు ఎవరినైనా ప్రేమిస్తే ఇదంతా తెలుస్తుంది అని అంటుంది. ఇక నేను నీ మొహం మీద వద్దని చెబుతున్నా.. మా ఇద్దరి మధ్య ఎందుకు దూరుతున్నావ్? అని జ్వాల హిమను అంటుంది.

అప్పుడే హిమ బావ మనసులో నువ్వు లేవు అన్న నిజం నీకు ఎక్కడ తెలుస్తుందో అన్న భయంతో నేను మీ వెనకే వస్తున్నాను అని అనుకుంటూ ఉంటుంది. నిరుపమ్ నేను అమెరికా వెళదాము అనుకుంటున్నాను అని అనడంతో హిమ సౌర్య లు స్టన్ అవుతారు. ఇక తరువాయి భాగం లో హిమ కు క్యాన్సర్ అని నిరుపమ్ కి తెలుస్తుంది. ఇక నీ కోసం నా ప్రాణాలు అడ్డుగా వేస్తాను హిమ అని నిరుపమ్ అంటాడు. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel