Balakrishna: సప్తగిరి కాళ్లు పట్టుకోబోయిన నందమూరి బాలకృష్ణ, ఎందుకో తెలుసా?

Balakrishna: గోపిచంద్ మలినేని, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ఎన్ బీకే107 అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ చత్ర బృందం ప్రస్తుతం ఫారెన్ లో షూటింగ్ పనుల్లో చాలా బిజీగా ఉంది. అయితే ఈ క్రమంలోనే ప్రముఖ హాస్య నటుడు సప్తగిరి.. బాలయ్య బాబును, స్వయంగా ఆయన ఎదుటే ఇమిటేట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. సప్తగిరి యాక్టింగ్ కు ఫిదా అయిన బాలకృష్ణ ఆనందంలో సప్తగిరి కాళ్లు పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఇది గమనించిన సప్తగిరి కిందపడి.. బాలకృష్ణ కాళ్లు పట్టుకొని నవ్వడం, అందరిలోనూ నవ్వులు పూయిస్తోంది.

అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా… చూసిన ప్రతీ ఒక్కరూ లైకులు, షేర్లు, కామెంట్లతో చెలరేగిపోతున్నారు. బాలయ్య బాబు కాళ్లు పట్టుకోవడం ఏంటని కొందరు అంటుండగా.. మీరు సూపర్ సార్ అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. టాలెంట్ ఉన్నవాళ్లను ఎంకరేజ్ చేయడంలో బాలకృష్ణ తర్వాతే ఎవరైనా అనే విషయం ఈ వీడియో చూస్తే అర్థం అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఓ సారి ఈ వీడియో చూడండి.

Advertisement

 

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel