Music Stairs : మెట్రోలో మెట్లు నుంచి మ్యూజిక్.. భలే ఉందిగా.. ప్రయాణికులకు ఉల్లాసం..!

Music Stairs: మెట్లు ఎక్కితే అలసట వస్తుంది.. కానీ, ఈ మెట్లు ఎక్కితే మరింత ఉత్సాహం వస్తుందంట.. అసలే బోర్ కొట్టదట.. ఇప్పటివరకూ లిఫ్టులు, ఎస్కలేటర్లు వాడినవారంత ఈ మెట్లు ఎక్కేందుకు తెగ ఇష్టపడుతున్నారు.. ఇంతకీ ఎక్కడో తెలుసా? కేరళలోని ఓ మెట్రో స్టేషన్​లో.. మెట్రోలో మెట్లు ఎక్కే ప్రయాణికులు చాలా ఉల్లాసంగా ఎంజాయ్ చేస్తున్నారు.. ఎస్కలేటర్ మాని మెట్లు ఎక్కేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఉల్లాసానికి ఉల్లాసం..

ఎర్నాకుళంలోని ఎంజీ రోడ్ మెట్రో స్టేషన్​లో పియానో సౌండ్స్ వచ్చే మ్యూజికల్ స్టెయిర్​కేస్ ఏర్పాటు చేశారు. ఈ మెట్లపై అడుగు పెడితే లైట్లు మెరుస్తూ పియానో, కీబోర్డు మ్యూజిక్ వినిపిస్తుంది. ఈ మెట్లపై నడిచే ప్రయాణికులు హాయిగా నవ్వుతూ సంగీతాన్ని ఎంజాయ్ చేస్తూ అలసట లేకుండా చక్కగా మెట్లు ఎక్కేస్తున్నారు. మెట్రో అధికారులపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మెట్లు ఎక్కేటప్పుడు దిగుతున్నప్పుడు సంగీతం వినిపించడంతో ఒత్తిడి నుంచి రిలీఫ్ అవుతున్నామని అంటున్నారు. విదేశాల్లో తరహా సౌకర్యాలు ప్రాంతాల్లోనూ అందుబాటులోకి రావడంతో ప్రయాణికులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ట్రయాక్సియా ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్​తో కేఎంఆర్ఎల్​ మ్యూజికల్ స్టెయిర్​కేస్​ ఈ మ్యూజిక్ స్టెప్స్ ఏర్పాటు చేసింది.

Advertisement

Read Also : Luffa Health Benefits : మద్యం ఎంత తాగినా బీరకాయలు తింటే ఆరోగ్యంగా ఉండొచ్చు.. ఈ సంగతి మీకు తెలుసా?

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel