Karthika Deepam September 10 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో దీప జరిగింది మొత్తం డాక్టర్ వాళ్ళ అమ్మతో చెబుతూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ లో దీప వాళ్ళ డాక్టర్ అన్నయ్య దీప కు ధైర్యం చెబుతూ ఉంటాడు. అప్పుడు దీప కూడా ఎలా అయినా మోనిత దగ్గర ఉండగానే డాక్టర్ బాబుకి గతం గుర్తుకు వచ్చేలా చేస్తాను అని అంటుంది. ఎలా అయినా ఆ మోనిత చర నుంచి డాక్టర్ బాబును విడిపించుకుని దానికి తగిన విధంగా బుద్ధి చెబుతాను అని అంటుంది దీప. అప్పుడు దీప డాక్టర్, వాళ్ళ అమ్మ ఇద్దరూ కూడా సంతోష పడుతూ ఉంటారు.

మరొకవైపు మోనిత జరిగిన విషయాలను తలచుకొని టెన్షన్ పడుతూ ఉంటుంది. వంటలకు ఎలా వదిలించుకోవాలి అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి డ్రైవర్ శివ అక్కడికి వచ్చి దీపక వచ్చింది మేడం అని చెప్పడంతో చంప పగలగొడుతుంది మోనిత. ఇంకొకసారి దాన్ని దీపక్క వంటలక్క అంటూ వరుసలు కలిపావంటే చంపేస్తాను అని వార్నింగ్ ఇస్తుంది.
మరోవైపు దీప తోరణాలు కడుతూ ఉంటుంది. ఇంతలోనే మోనిత అక్కడికి వచ్చి దీపను దీపక్క అని పిలవడంతో డ్రైవర్ శివ షాక్ అవుతాడు. అప్పుడు దీప కూడా వెటకారంగా చెప్పు చెల్లి అని అంటుంది. వారి మాటలు శివకు అర్థం కాకపోవడంతో శివను అక్కడి నుంచి మోనిత పంపించి రేపు మా ఆయన పూజకు రమ్మన్నాడు అని చెబుతుంది.
Karthika Deepam September 10 Today Episode : సంతోషంలో శౌర్య..
అప్పుడు దీప ఆయన చెప్పినందుకు కాదు నువ్వు ఇక్కడికి వచ్చినందుకు అయినా కూడా నేను వస్తాను అని అంటుంది. అప్పుడు మోనిత, దీప మాటలకు కోపంతో రగిలి పోతూ ఉంటుంది. మరొకవైపు వారణాసి, సౌర్యను చూసి ఎక్కడ ఉండాల్సిన దానివి ఇక్కడ ఉన్నావు అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు సౌందర్య వాళ్ల గురించి హిమ గురించి మాట్లాడడంతో వెంటనే సౌర్య వారణాసి పై సీరియస్ అవుతుంది.
ఇక రోడ్డు పక్కన బొమ్మలు అమ్ముతూ ఉండగా అటుగా వెళుతున్న కార్తీక్ కారు ఆపి సౌర్యను చూసి బాధపడతాడు. ఆ అమ్మాయిని ఎక్కడో ఉంది అయినా ఎంతలా కష్టపడుతుందో చూడు అంటూ బాధపడతాడు కార్తీక్. అప్పుడు మోనిత కొంపతీసి గతం గుర్తుకు వచ్చిందా అని టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ బొమ్మలు తీసుకుని వస్తాను అని దిగుతుండగా వెంటనే మోనిత డ్రైవర్ శివని పంపిస్తుంది.
ఆ తర్వాత డ్రైవర్ శివ అక్కడికి వెళ్లి బొమ్మను తీసుకొని లాగా వెంటనే కార్తీక్ శివ ని గట్టిగా కొడతాడు. ఆ పాపకి ఎందుకు పని చెప్పావు అంటూ శివ పైకి అరుస్తాడు. అప్పుడు సౌర్య బొమ్మలు అయిపోయినందుకు సంతోష పడుతూ ఉంటుంది. రేపటి ఎపిసోడ్ లో మోనిత, కార్తీక్ లో పూజలో కూర్చుంటూ ఉండగా అప్పుడు దీప డాక్టర్ బాబు మీరు నాకు ఒక మాట ఇచ్చారు అదేంటో మీకు పేపర్లో రాసి ఇచ్చాను అనడంతో కార్తీక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
అప్పుడు మోనిత ఏం చెప్పారే అని అడగడంతో ఇప్పుడు నీకు ఒక షాక్ ఇస్తాను చూడు అని అంటుంది దీప. అప్పుడు కార్తీక్ లోపల నుంచి ఆ పేపర్ తీసుకొని వచ్చి మోనిత ముందు చదవగా మోనిత ఆ మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతుంది.
Read Also : Karthika Deepam September 9 Today Episode : దీపను కారులో ఎక్కించుకొని వెళ్లిన డాక్టర్ బాబు..షాక్ లో మోనిత..?
- karthika Deepam july 13 Today Episode : జ్వాలానే సౌర్య అని తెలుసుకున్న నిరుపమ్,స్వప్న..ఆనందంలో సౌందర్య కుటుంబం..?
- Karthika Deepam Serial : మోనిత కన్నీటికి కరిగిపోయిన డాక్టర్ బాబు.. ట్విస్ట్ ఏంటంటే?
- Karthika Deepam November 17 Today Episode : కార్తీక్ పై అనుమాన పడుతున్న దీప.. సౌర్యని ఇంటికి తీసుకెళ్లాలి అనుకుంటున్న సౌందర్య..?













