Karthika deepam: గత కొన్ని రోజుల నుంచి కార్తీకదీపం సీరియల్ రసవత్తరంగా సాగుతోంది. అందుకు కారణం వంటలక్క దీప, డాక్టర్ బాబులు రీఎంట్రీ ఇవ్వడమే. వీరిద్దరే కాదండోయ్.. తాజాగా మోనిత కూడా ఎంట్రీ ఇచ్చేసింది. ఫ్లాష్ బ్యాక్ స్టోరీలో ఓ వైపు కార్తీక్ గతం మర్చిపోయాడు. మరోవైపు దీప పిచ్చి దానిలా కార్తీక్ ను వెతుకుతూ ఉంటుంది. తీరా ఓ మార్కెట్ లో కార్తీక్ ని కలిసి నేను మీ భార్యని గుర్తు పట్టారా అనగా.. అతడు వింతగా చూస్తాడు.

నేను డాక్టర్ బాబు ఏంటంటూ రివర్స్ ప్రశ్నలు వేస్తాడు. పైగా కార్తీక్ పక్కనే ఉన్న శివకు మాత్రం అంతా తెలిసినట్లే ఉంది. మొదట దీప కార్తీక్ ఫొటో చూపించి తెలియదని అబద్ధం చెబుతాడు. తర్వాత కార్తక్ ముందే దీప నిలదీస్తే.. ఆమె పిచ్చిదని చెప్పి కార్తీక్ ని లాక్కెళ్తాడు. ఈ క్రమంలోనే మోనిత ఎంట్రీ అదిరిపోయింది.
రేపటి ప్రోమోలో మోనిత రీఎంట్రీ సీరియల్ ను ఎలా రక్తి కట్టించగల్గుతుందో చూడాలి మరి. అయితే ఈ ప్రోమోలో దీప కార్తీక్ ను వెతుకుతుండగా.. పర్స్ లో కార్తీక్ ఫొటో చూపిస్తూ.. అంతా తిరుగుతుంది. సరిగ్గా అప్పుడే మోనిత కార్తీక్ ఫొటో దీప ముందు పెట్టి ఎంట్ర ఇస్తుంది.
- Karthika Deepam Promo : కార్తీక దీపంలో కొత్త ట్విస్ట్.. ఆటో డ్రైవర్‌గా సౌర్య.. డాక్టర్‌గా హిమ.. ప్రోమో హైలట్స్ ఇవే..!
- Karthika Deepam: కార్తీకు గతం గుర్తుకు తెచ్చే ప్రయత్నంలో వంటలక్క..మోనితతో ఛాలెంజ్ చేసిన దీప..?
- Karthika Deepam Serial సెప్టెంబర్ 30 ఎపిసోడ్ : దీప, సౌర్యని కలవరిస్తున్న డాక్టర్ బాబు.. మోనిత, దుర్గ లవర్స్ అనుకుంటున్న కార్తీక్..?















