Karthika Deepam: స్వప్న పై మండిపడ్డ ఆనందరావు.. మళ్ళీ ప్రేమ్ ప్లాన్ ను నాశనం చేసిన జ్వాలా.?

Karthika Deepam: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో బాగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో స్వప్న,నిరూపమ్ కీ పెళ్లి చూపులు ఏర్పాటు చేయగా అక్కడికి వచ్చిన సౌందర్య ఏకంగా పెళ్లి కూతురుతో నిరూపమ్ కీ రాఖీ కట్టిస్తుంది.

ఈరోజు ఎపిసోడ్ లో హిమ, టెన్షన్ పడుతూ ఉంటుంది. సౌర్య చెప్పిన ఆర్టిస్ట్ నా బొమ్మ గీస్తే నా పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తూ భయపడుతూ ఉంటుంది. మరొకవైపు నానమ్మ కూడా సౌర్య బొమ్మ గీయిస్తాను అని చెప్పి పట్టుబట్టింది. ఇప్పుడు ఏం చేయాలి దేవుడా అని హిమ తెగ టెన్షన్ పడిపోతూ ఉంటుంది.

Advertisement

మరొకవైపు సౌందర్య చేసిన పనికి స్వప్న ఆనందరావు పై మండి పడుతూ ఉంటుంది. ఆనందరావు కూడా సౌందర్య కి సపోర్ట్ చేస్తూ మాట్లాడి ఇప్పటి వరకు నీకు మమ్మీ లేదు అనుకున్నావు ఇప్పటినుంచి డాడీ కూడా లేడు అనుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళి పోతాడు. మరొకవైపు జ్వాలా సత్య కోసం ఫుడ్ తీసుకొని వస్తుంది.

ఇంతలో ప్రేమ్ అక్కడికి వచ్చి గొడవ పెట్టుకుంటాడు. మరొకవైపు ఆనంద్ ఒంటినిండా దెబ్బలతో ఇంటికి ఏడుస్తూ వస్తాడు. మరొకవైపు ఆర్టిస్ట్ బొమ్మలు గీస్తూ రెండు బొమ్మలు ఒకే విధంగా ఉన్నాయి అని ఆలోచిస్తూ ఉంటుంది. మరొకవైపు హిమ, నిరూపమ్ సరదాగా బయటికి వెళ్లి పానీపూరీ పందెం పెట్టుకుంటారు.

హిమ గెలిస్తే నీకు నేను ఒక గిఫ్ట్ ఇస్తాను అని ప్రేమ్ చెబుతాడు. కావాలనే ఓడిపోయి హిమకు ఎలా అయినా గిఫ్ట్ ఇవ్వాలి అని ప్రేమ్ ప్లాన్ చేసుకుంటాడు. ఇంతలో అక్కడికి వచ్చిన జ్వాల ప్రేమ్ ప్లాన్ ని నాశనం చేస్తుంది. అంతేకాకుండా పానీపూరి పందెంలో జ్వాలా గెలుస్తుంది.

Advertisement

మరొకవైపు ఆనందరావు తన ఇంటికి వచ్చి స్వప్న ని మార్చడం ఇంకా ఎవరి వల్ల కాదు అంటూ స్వప్నపై మండిపడతాడు. మరొకవైపు రవ్వ ఇడ్లీ కి జ్వరం అని తెలుసుకున్న జ్వాల తనతో పాటుగా హిమను కూడా అక్కడికి తీసుకొని వెళుతుంది. ఆనంద్ ఇంట్లో మోనిత, కార్తీక్ ఫోటోలు చూసిన జ్వాలా, హిమ ఒక్కసారిగా షాక్ అవుతారు.

Ramesh Babu

Senior Content Editor

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
Join our WhatsApp Channel