Karthika Deepam january 11 Today Episode : సౌందర్యకి అబద్దం చెప్పిన కార్తీక్,దీప.. కోపంతో రగిలిపోతున్న మోనిత?

Updated on: January 11, 2023

Karthika Deepam january 11 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో మోనిత, కార్తీక్ వాళ్ళ ఇంట్లో ఉండడంతో అందరూ షాక్ అవుతారు.

ఈరోజు ఎపిసోడ్ లో సౌందర్య కోపంతో మోనిత జుట్టు పట్టుకోగా వదలండి ఆంటీ ఇప్పుడే నీ కొడుకు నా వైపు చూడడం లేదు జుట్టు చెదిరిపోతే అసలు చూడడు అని అంటుంది. అయినా ఏం జరిగింది అన్నది నీ కొడుకు కోడలు చెప్పి ఉంటారు కదా మళ్లీ నన్ను ఎందుకు అడుగుతున్నారు. కొంతకాలం రాకపోవడానికి నేనే కారణం కానీ నేను జైలుకు వెళ్ళిన తర్వాత మాత్రం నాకు సంబంధం లేదు అనడంతో పిచ్చిపిచ్చిగా వాగకుండా బయటికి వెళ్ళే మోనిత అంటుంది దీప. అప్పుడు అది ఏం చెప్తుంది మీరు నా దగ్గర ఏం నిజం రాస్తున్నారు అని సౌందర్య అడగగా ఈ పాపని చెబుతూ అదేం లేదు అత్తయ్య.

Karthika Deepam january 11 Today Episode
Karthika Deepam january 11 Today Episode

దాని గురించి మనందరికీ తెలిసిందే కదా ఏదో ఒక గొడవలు పెట్టాలని చూస్తుంది అని మోనితని మెడ పట్టి బయటకు గెంటేస్తుంది. అప్పుడు సౌందర్య కార్తీక్ దీపల మీద సీరియస్ అవుతూ అదేం మాట్లాడుతుంది పెద్దోడా మీరు చూస్తే ఏమీ లేదు అంటున్నారు నిజం చెప్పండి అనడంతో నిజంగా ఏం లేదమ్మా ఉంటే మేము చెప్పమా అని అబద్ధం చెబుతాడు కార్తీక్. సరే ఇప్పుడు ఇకనుంచి బయలుదేరండి అనడంతో కార్తీక్ వాళ్ళు సరే అని అంటారు. మరొకవైపు మోనిత కార్తీక్ వాళ్ళ ఇంట్లో జరిగిన అవమానానికి టీపాయ్ తో తన చేతికి గాయం చేసుకోవడంతో చారుశీల ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది.

Advertisement

ఎందుకు ఇలా చేసావు మోనిత అని అడగడంతో నేను కాదు కార్తీక్ పై నాకు నా ప్రేమ ఇలా చేయిస్తోంది కానీ కార్తీక్ మాత్రం నన్ను అర్థం చేసుకోవడం లేదు అని అంటుంది. మరి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావో అనడంతో అదే అర్థం కావడం లేదు అనగా వెంటనే చారుశీల కార్తీక్ ని వదిలేసేయ్ ఎలాగో కార్తీక్ నీ మీద ప్రేమ లేదు కదా అని అంటుంది. వదిలేయడానికే నేను ఇన్నేళ్లు కార్తీక్ అనగా పడలేదు. ఎలా అయినా కార్తీక్ ని నా సొంతం చేసుకుని తీరుతాను అని అంటుంది.

మరొకవైపు సౌందర్య ఇంటికి వెళ్ళిన కార్తీక్ వాళ్ళు భోజనం చేయడానికి కూర్చోగా అప్పుడు పదేపదే కార్తీక్ దీప వైపు చూడడంతో మోనిత అన్నట్టుగా వీళ్లిద్దరూ తోడు నా దగ్గర ఏదో నిజం రాస్తున్నారు అని మనసులో అనుకుంటూ ఉండగా అప్పుడు పిల్లలు అమ్మ తొందరగా తీసుకొని రా అమ్మ అని అంటారు. అప్పుడు దీప అక్కడికి రావడంతో కార్తీక్ దీప ఇద్దరు మూగ సైగలు చేసుకుంటూ ఉండగా వీరిద్దరూ నా దగ్గర ఏదో నిజం చేస్తున్నారు అందుకే వచ్చినప్పటి నుంచి మూగ సైలు చేసుకుంటున్నారు అని అనుకుంటూ ఉంటుంది సౌందర్య.

అప్పుడు సౌందర్య కార్తీక్ దీప ని నిలదీస్తూ నిజంగా మీరు నా దగ్గర నిజం దాస్తున్నారు చెప్పండి అని అంటూ ఏమీ లేదులే నువ్వు తిను తల్లి అని సౌందర్యం దీప అనడంతో పిల్లలు నవ్వుకుంటూ ఉంటారు. ఇంతలోనే అంజి అక్కడికి రావడంతో నిజం చెప్పు అంజి వీళ్ళు అక్కడ ఉన్నారని నీకు ముందే తెలుసు కదా అని అనగా మొదట మనం వెళ్ళినప్పుడు తెలియదమ్మా ఆ తర్వాత దీపమ్మ వాళ్ళ ఇంట్లోనే మా అమ్మ పని మనిషిగా పనిచేస్తుంది అప్పుడు నాకు తెలిసింది అని అంటాడు అంజి.

Advertisement

మరొకవైపు మౌనిత ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో చారుశీల అక్కడికి వచ్చి మళ్లీ ఏదైనా ప్లాన్ వేసావా అని అడుగుతుంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు అందరూ ఒక్కటే అయ్యారు అదే నా బాధ. అప్పుడు వారిద్దరూ కలిసి దీప వాళ్ళను ఏదో ఒకటి చేయాలి అని ఆలోచించుకుంటూ ఉంటారు. మరొకవైపు కార్తీకదీపం నిలదీస్తూ ఎందుకు దీప ఇలా చేశావు అనడంతో అది వదిలేయండి డాక్టర్ బాబు మరి మీరు పిల్లలకు ఎలా కనిపించారు అని అనగా కార్తీక్ మౌనంగా ఉండడంతో ఆ దేవుడు ఎప్పుడు ఎవరిని ఎలా కలపాలో బాగా తెలుసు అని అంటుంది దీప.

అప్పుడు వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా మరోవైపు సౌందర్య వీళ్ళు ఇద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు వారి మాటలు చాటగా వింటే తప్ప వాళ్ళ మంచం ఏముందో తెలియదు అని అక్కడికి వెళుతుంది. ఇంతలో సౌందర్య అక్కడికి రావడం గమనించిన దీప టాపిక్ డైవర్ట్ చేసి మాట్లాడుతుంది. అప్పుడు కార్తీక్ ఏమీ అర్థం కాక దీప వైపు చూడడంతో దీప సీరియల్ చేయగా కార్తీక్ కూడా టాపిక్ డైవర్ట్ చేసి మాట్లాడుతాడు.

Read Also : Karthika Deepam january 10 Today Episode : కార్తీక్, దీప లను నిలదీసిన సౌందర్య…. షాక్ లో మోనిత..?

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel