MLA Nandamuri Balakrishna : హిందూపురాన్ని జిల్లాగా ప్రకటించాలన్న బాలయ్య… అవసరమైతే రాజీనామా !

Updated on: February 4, 2022

MLA Nandamuri Balakrishna : హిందూపురం కేంద్రంగా జిల్లాను ప్రకటించాల్సిందేనని బాలకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు బాలయ్య. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ప్రకటన అనంతరం రాజకీయ వేడి ముదిరిందని చెప్పాలి. తమ ప్రాంతం పేరుతో జిల్లాను ప్రకటించాలని ఇప్పటికే పలు జిల్లాల ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. ముఖ్యంగా హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలన్న డిమాండ్‌ బాగా వినిపిస్తోంది.

కొత్తగా ఏర్పాటు చేయనున్న శ్రీ సత్యసాయి జిల్లాకు పుట్టపర్తి కాకుండా హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని నేతలు డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సైతం హిందూపురం జిల్లా ఉద్యమానికి మద్దతు పలికిన విషయం తెలిసిందే. దీనిపై బాలకృష్ణ మరో ఉద్యమానికి నాంది పలికారు.

ఈ మేరకు హిందూపురంలో బాలకృష్ణ మౌనదీక్ష చేపట్టారు. ముందు పట్టణంలోని పొట్టి శ్రీరాములు కూడలి నుంచి అంబేడ్కర్‌ కూడలి వరకు టీడీపీ శ్రేణులు, జిల్లా మద్దతు దారులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి అంబేడ్కర్‌ కూడలిలో బాలకృష్ణ మౌన దీక్షకు కూర్చున్నారు.

Advertisement

ఈ సందర్భంగా బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూపురం జిల్లా కేంద్రంగా ప్రకటించకపోతే… తాను రాజీనామా చేస్తానని అన్నారు. వైసీపీ ప్రజా ప్రజాప్రతినిధులు రాజీనామా చేయడానికి సిద్దమేనా అంటూ సవాల్‌ విసిరారు.

హిందూపురం కేంద్రంగా జిల్లాను ప్రకటించాల్సిందేనని బాలకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ ప్రాంతం కోసం ఏం చేయ‌డానికైనా సిద్ధ‌మ‌ని, హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేస్తే ఆధ్యాత్మికంగానూ, సామాజికంగా స‌రిపోతుంద‌ని చెప్పారు బాలకృష్ణ. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్ర‌క‌టించే వ‌ర‌కు ఆందోళ‌న‌లు కొన‌సాగిస్తామ‌ని వెల్లడించారు. తెలుగుదేశం హయాంలో కడప జిల్లాకు ఉన్న వైఎస్ఆర్ పేరును అలాగే ఉంచలేదా? అని ప్రశ్నించారు.

ఇదిలా ఉంటే… మౌన దీక్ష అనంతరం బాలకృష్ణ సాయంత్రం అఖిలపక్ష నేతలతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొననున్నారు. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలనే డిమాండ్‌తో చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ప్రస్తుతం ఈ వార్త మీడియా లో అత్ టాపిక్ గా సాగుతుంది.

Advertisement

Read Also : Crime News : కట్టుకున్న భార్యని కడతేర్చిన కిరాతకుడు… షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి !

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel