MLA anna rambabu : మంత్రి పదవి రాలేదని అలిగి.. ఫోన్ స్విచ్చాఫ్ చేసిన అన్నా రాంబాబు!

Updated on: November 9, 2022

MLA anna rambabu : ఆంధ్ర ప్రదేశ్ మంత్రి వర్గంలో చాలా మంది ఆశావహులకు స్థానం ఇవ్వకుండా కొత్తవారికి ఇచ్చారు. గతంలో మంత్రులుగా ఉన్న వారిని కూడా పక్కన పెట్టేసారు. అయితే చాలా మంది మంత్రి పదవి వస్తుందనుకొని రాకపోయేసరికి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మేకపాటి సుచరిత అయితే ఎమ్మెల్యే పదవికే రాజీనామా చేసింది. అలాగే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి కూడా పదవికి రాజీనామా చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నారు.

అయితే మంత్రి పదవి ఇవ్వలేని గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు అలక పాన్పు ఎక్కారు. ఎవరితో మాట్లాడకుండా ఫోన్ స్విచ్చాఫ్ చేసి మార్కాపురంలోని నివాసంలో ఉండిపోయారు. వచ్చిన నాయకులు, కార్యకర్తలను కలిసేందుకు ఇష్ట పడటం లేదని అన్నా రాంబాబు అనుచరులు తెలిపారు. అయితే అన్నా రాంబాబుకు మంత్రి పదవి రాకపోవడంతో.. ప్రకాశం జిల్లాలో ఆయన అనుచరులు నిరసనలు చేస్తున్నారు. ఎక్కడికక్కడ రోడ్డు ఆందోళనలు, రోడ్డుపై బైఠాయించడం వంటివి చేస్తూ… తమ అసంతృప్తిని వెల్లడిస్తున్నారు. ఆర్యవైశ్యులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి నిరసన తెలుపుతున్నారు.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel