Kacha Badam Song : కచ్చా బాదాం… ఇప్పుడు ఎక్కడా చూసినా విన్నా నెట్టింట్లో ఈ పాటే వినబడుతోంది. కచ్చా బాదం పాటకు ప్రపంచమే ఫిదా అయిపోయింది. సెలబ్రెటీల నుంచి ప్రతిఒక్కరూ కచ్చా బాదం అంటూ తెగ ట్రెండ్ చేస్తున్నారు. ఇప్పటికీ ఈ కచ్చా బాదం క్రేజ్ తగ్గనేలేదు.. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ప్రతిఒక్కరిని ఆకట్టుకుంటోంది ఈ పాట.. అంత క్రేజ్ వచ్చింది. ఇప్పుడు పోలీసులు కూడా కచ్చా బాదం పాటకు స్టెప్పులతో అదరగొట్టేస్తున్నారు. కచ్చా బాదం అంటూ ఖాకీల డ్యాన్స్ నెట్టింట్లో కేక పుట్టిస్తోంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది…
మార్చి 21న @GoofyOlives అకౌంట్ నుంచి ట్విట్టర్‌లో ఈ వీడియోను పోస్ట్ చేయగా.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోకు 479 రీట్వీట్లు రాగా, 3000 పైగా లైక్‌లు వచ్చాయి. అంతేకాదు.. ‘ఖాకీలు ఎందుకు సరదాగా ఉండకూడదు’ అంటూ ఈ వీడియోకు క్యాప్షన్ కూడా పెట్టారు. పోలీసు యూనిఫాంలో ఉన్న “కచా బాదం సాంగ్ డ్యాన్స్ చేశారు. వీరిలో ఒక మహిళా పోలీసు కూడా ఉన్నారు. పోలీసుల డ్యాన్స్ కు ఫిదా అయిన నెటిజన్లు సరదాగా కామెంట్లు పెడుతున్నారు.

బాధ్యతాయుతమైన యూనిఫాంలో ఉన్నప్పుడు పోలీసులు ఇలా డ్యాన్స్ చేయడం కరెక్ట్ కాదని ట్విట్టర్ యూజర్లు కామెంట్లు చేస్తున్నారు. ఖాకీ యూనిఫామ్‌లో ఉంటే పోలీసులు సంతోషం కోసం ఇలా చేయకూడదా? అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. విధి నిర్వహణలో అనేక ఒత్తిడులు ఉంటాయని, ఇలా కాసేపు సరదాగా ఉంటే ఒత్తిడి నుంచి బయటపడొచ్చునని పోలీసులకు సపోర్టుగా కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా.. కచ్చా బాదం పాటకు ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదనే చెప్పాలి. మీరూ కూడా ఖాకీల కచ్చా బాదం సాంగ్ వీడియోను చూసేయండి..
Why shouldn’t khaki have some fun. Watch out on left and right most. pic.twitter.com/izKTzrq0Sm
— Da_Lying_Lama🇮🇳 (@GoofyOlives) March 21, 2022