Janaki Kalaganaledu: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రామచంద్ర, జానకి చదువుకు కావలసిన డబ్బు గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటారు.
ఈరోజు ఎపిసోడ్ లో జ్ఞానాంబ, నా కొడుకుకి ఈ పరిస్థితి రావడానికి కారణం నువ్వే. అంటూ జానకి పై విరుచుకుపడుతుంది జ్ఞానాంబ. మరొకవైపు మల్లిక, ఆమె భర్త ఇద్దరు బజారుకు వెళ్లి అక్కడ సామాన్లు కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడికి వచ్చిన రామచంద్ర ఫైనాన్స్ షాప్ వైపు వెళ్తాడు.

అది గమనించిన మల్లికా తన భర్తకు చెప్పగా అతను సైలెంట్ గా ఉండమని చెబుతాడు. మరొకవైపు ఫైనాన్స్ షాప్ లోకి వెళ్ళిన రామచంద్ర ఒక లక్ష రూపాయలు వడ్డీకి అప్పు గా ఇవ్వమని అడుగుతాడు. అప్పుడు వాళ్లు డబ్బులు ఇస్తాను కానీ మీ అమ్మగారితో ఒక మాట చెప్పించు అని అనడంతో రామచంద్ర మళ్ళీ వస్తాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.
మల్లిక రామచంద్ర ఫైనాన్స్ షాప్ కి వెళ్ళిన విషయం జ్ఞానాంబ తో చెబుతూ బావగారు అప్పు తీసుకుంటున్నారో లేక మనకి తెలియకుండా వడ్డీల వ్యాపారం చేస్తున్నాడో అని జ్ఞానాంబku చెప్పడంతో ఇంతలో అక్కడికి వచ్చిన రామచంద్రని నిలదీస్తుంది జ్ఞానాంబ.
అప్పుడు రామచంద్ర అప్పు కోసం వెళ్లాను అని అనగా ఇంతలో బీరువా తాళాలు రామచంద్రకు చేతిలో పెట్టి ఇంట్లో డబ్బులు అడగకుండా తీసుకునే హక్కు నీకు ఉంది అని చెప్పడంతో మల్లిక కుళ్ళుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత జానకి అసలు విషయం తెలుసుకొని ఐపీఎస్ నేను చదవను, నాకు చదువు వద్దు అని రామచంద్ర తో అనడంతో అప్పుడు రామచంద్ర మనం గెలుపొందాకా ఈ కష్టాలన్నీ కూడా అందమైన జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి అని చెబుతాడు.
ఆ తర్వాత రామచంద్ర అప్పు పత్రాలపై సైన్ చేసి లక్ష రూపాయలు తీసుకుంటాడు. ఈ విషయం పట్ల రామచంద్ర శత్రువు ఎలా అయినా రామచంద్ర పై పగ తీర్చుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు. మరొకవైపు రాత్రి సమయంలో రామ,జానకి లు బయటకు వెళ్తున్నారు అని తెలుసుకున్న జ్ఞానాంబ పగలంతా షాప్ లో కష్టపడి పనిచేసి వచ్చిన నా కొడుకుని నిద్రపోనివ్వవా అంటూ జానకి పై సీరియస్ అవుతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
- Janaki Kalaganaledu serial Sep 15 Today Episode : అఖిల్ ని నిలదీసిన గోవిందరాజులు.. జెస్సి కి వార్నింగ్ ఇచ్చిన అఖిల్..?
- Janaki Kalaganaledu serial Oct 21 Today Episode : మల్లిక ప్లాన్ ను తిప్పి కొట్టిన జానకి.. బాధలో జ్ఞానాంబ..?
- Janaki Kalaganaledu june 20 episode : తల్లి చేతుల మీదుగా ప్రైజ్ మనీ అందుకున్న రామ… కోపంతో రగిలి పోతున్న కన్నబాబు సునంద?















