Guppedantha Manasu Oct 18 Today Episode : గౌతమ్ తో ఎమోషనల్ గా మాట్లాడిన రిషి.. రిషి గురించి ఆలోచిస్తున్న మహేంద్ర జగతి..?

Guppedantha Manasu Oct 18 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో వసూ ప్రేమతో కొన్ని మాటలు చెప్పడంతో రిషి ఇంప్రెస్స్ అవుతాడు. ఈరోజు ఎపిసోడ్ లో జగతి మేడం నాకు ఇష్టం అయితే మీరు నా జీవితం సార్ అని అనడంతో అన్ని విషయాలు సరిగ్గానే ఉంటావో ఆ ఒక్క విషయంలో ఎందుకు అలా చేస్తున్నావ్ వసుధార, గురుదక్షిణ విషయాన్ని వదిలేయవచ్చు కదా అని అనగా లేదు సార్ నేను మాట మీద నిలబడాలి అనుకుంటున్నాను కావాలంటే మీరే తగ్గొచ్చు కదా అంటుంది వసుధార.. జగతి మేడమ్‌ను అమ్మ అని పిలిచినంత మాత్రాన తగ్గేదేముంది.. అందులో నాకు లాభం ఏముంది చెప్పండని రిషితో వసుధార అంటుంది.

Jagathi and Mahindra get upset in todays guppedantha manasu serial episode
Jagathi and Mahindra get upset in todays guppedantha manasu serial episode

అప్పుడు రిషి కోపంతో నువ్వు మారతావు అనుకోవడం నా తప్పు అని కోపంగా అరిచి అక్కడ నుంచి వెళ్లిపోతాడు రిషి. మరొకవైపు జగతి మహేంద్రలు జరిగిన విషయాన్ని తెలుసుకుని బాధపడుతూ ఉంటారు. అప్పుడు రిషి వచ్చాడా అని అడగగా ఇంకా రాలేదు మహేంద్ర అని జగతి చెబుతుంది. అప్పుడు వారిద్దరు రిషి గురించి కంగారు పడుతూ ఉంటారు.

ధరణి అక్కడికి వచ్చి దేవయాని అత్తయ్య ప్రవర్తనలో చాలా మార్పు కనపడింది. ఏదైనా ప్లాన్ చేస్తున్నారేమో అని భయంగా ఉంది అంటూ జరిగిన విషయం మొత్తం చెబుతుంది. రిషి పెద్దత్త కి ఫోన్ చేసి ఈరోజు ఇంటికి రానన్నాడట అని చెప్తుంది ధరణి. మరొకవైపు రుషి కాలేజీకి వెళ్లగా అక్కడ గౌతం ఉంటాడు.

Advertisement

Guppedantha Manasu Oct 18 Today Episode : గురుదక్షిణ విషయంలో తగ్గేదేలే అన్న వసుధార..  

అప్పుడు రిషి గౌతమ్ ని వెటకారంగా మాట్లాడడంతో నేను నీకోసం వచ్చాను అని అనగా గౌతమ్ ని పిలుచుకొని చెట్టు కిందకు తీసుకొని వెళ్లి ఎమోషనల్ గా మాట్లాడుతాడు రిషి. నేను ఎవరి జీవితాలను డిస్టర్బ్ చేయకుండా నాకు కాలేజీ నడుపుకుంటూ గతం గురించి ఆలోచించకుండా సాఫీగా పోతున్నాను అటువంటి నా జీవితంలోకి జగతి మేడం వచ్చారు. ఆ తర్వాత వసుధార వచ్చింది కాస్త ఎమోషనల్ గా మాట్లాడుతాడు రిషి.

ఇప్పుడు గౌతమ్ సరే పదరా ఇంటికి వెళ్దాం అని అనగానే నేను ఇంటికి రాను అని చెప్పాను నువ్వు వెళ్ళు అనటంతో నేను ఇక్కడే ఉంటాను అని అంటాడు గౌతమ్. మరొకవైపు వసు రిషి ఫోటో చూస్తూ తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది. అప్పుడు రిషి కీ ఫోన్ చేయగా రిషి ఎత్తకపోవడంతో వెంటనే మెసేజ్ పెడుతుంది. తర్వాత జగతికి ఫోన్ చేయగా జగతికి కూడా ఫోన్ లిఫ్ట్ చేయదు. ఫోన్ చేయడంతో జగతి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు వసు అనగా రిషి సార్ ఉన్నాడా మేడం అని అడుగుతుంది.

లేడు అని చెప్పడంతో వెంటనే మహేంద్ర ఫోన్ లాక్కోని నీకు కూడా రిషి ఎక్కడున్నాడో తెలియదా అని అడుగుతాడు. మరొకవైపు గౌతమ్, రిషి కోసం భోజనం తీసుకొని వస్తాడు. ఆ భోజనం తిన్న రిషి ఎవరు తెచ్చారు ఇంటిదేనా అని అడగగా కాదు రా బాబు కొత్తగా హోటల్ పెట్టారు అని చెబుతాడు గౌతం. ఆ తర్వాత ఆ భోజనం వసు చేసింది అని పసిగట్టిన రిషి రూమ్ బయట వసుధార ఉండటంతో లోపలికి రమ్మని పిలుస్తాడు.

Advertisement

Read Also : Guppedantha Manasu serial Oct 17 Today Episode : మళ్లీ దగ్గరైన వసు,రిషి.. దేవయానిలో మార్పును చూసి భయపడుతున్న ధరణి..?

Ramesh Babu

Senior Content Editor

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
Join our WhatsApp Channel