India Digital Currency : డిజిటల్ కరెన్సీలోకి ఇండియా ఎంట్రీ.. ఆర్బీఐ ద్వారా డిజిటల్ రూపీ వస్తోంది..!

Updated on: February 1, 2022

India Digital Currency : ఇండియా డిజిటల్ కరెన్సీలో అడుగుపెట్టింది. డిజిటల్ కరెన్సీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది నుంచి డిజిటల్ రూపీని అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ 2022-23 ఆర్థిక బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. బ్లాక్ చెయిన్ టెక్నాలజీని ఉపయోగించి భారత రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) ఆర్బీఐ ద్వారా డిజిటల్ రూపీని తీసుకురానున్నట్టు నిర్మలా సీతారామన్ వెల్లడించారు.

డిజిటల్‌ కరెన్సీ రాకతో భారతదేశంలో డిజిటల్‌ బ్యాంకింగ్‌ మెరుగైన దశలో డెవలప్ అవుతుందని అన్నారు. బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీతో RBI రూపకల్పన చేస్తున్నట్లు నిర్మలమ్మ తెలిపారు. 2022 ఏడాదిలో డిజిటల్‌ కరెన్సీ అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆమె వివరించారు. అంతేకాకుండా యానిమేషన్‌ సెకార్టును కూడా ఇతర రకాల మాదిరిగానే ప్రోత్సహించేందుకు టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేస్తామని మంత్రి నిర్మల స్పష్టం చేశారు. ప్రత్యేక ఆర్థిక మండళ్ల చట్టానికి బదులుగా కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టనున్నామని తెలిపారు.

క్రిప్టో కరెన్సీల లావాదేవీలపై 30 శాతం పన్ను విధిస్తున్నట్టు మంత్రి నిర్మల స్పష్టం చేశారు. ఈ ఏడాదిలో RBI ద్వారా త్వరలో డిజిటల్‌ కరెన్సీ ప్రవేశపెట్టనున్నట్టు ఆమె వెల్లడించారు. ఈ డిజిటల్ కరెన్సీని భారత మార్కెట్లోకి తీసుకురావడం ద్వారా దేవీయ రూపాయికి మరింత బలాన్ని చేకూరుస్తుందని కేంద్రం భావిస్తోంది. అందుకే డిజిటల్‌ రూపీని ప్రవేశపెడుతున్నట్టు కేంద్రం ప్రకటించింది. కరెన్సీ కార్యకలాపాల నిర్వహణలో డిజిటల్‌ కరెన్సీల రూపకల్పన దిశగా అడుగులు వేస్తున్నట్టు మంత్రి నిర్మల తెలిపారు. ఈ ఏడాది నుంచి డిజిటల్ రూపీ అందుబాటులోకి వస్తుందన్నారు.

Advertisement

Read Also : RRR Movie : రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన ” ఆర్‌ఆర్‌ఆర్ ” టీమ్… ఈసారి మాత్రం పక్కా అంటూ !

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel