Youtube Channels Block : 22 యూట్యూబ్ ఛానెళ్లపై నిషేధం.. ఇండియావే 18!

Updated on: April 5, 2022

Youtube Channels Block : భారత్​పై దుష్ప్రచారం చేస్తున్న 22 యూట్యూబ్ ఛానెళ్లను కేంద్ర ప్రభుత్వం బ్లాక్​ చేసింది. అయితే ఇందులో 18 భారదేశానికి సంబంధించినవి కాగా… 4 న్యూస్ ఛానెళ్లు పాకిస్థాన్ కి చెందినవని కేంద్ర సమాచార ప్రసారాల శాఖ స్పష్టం చేసింది. భారత జాతీయ భద్రత, విదేశీ సంబంధాలు, పబ్లిక్ ఆర్డర్​కు సంబంధించి ఇవి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయని కేంద్రం ఈ చర్యలకు ఉపక్రమించింది. వీటితో పాటు మూడు ట్విట్టర్ ఖాతాలు, ఓ ఫేస్​బుక్ ఖాతా, ఒక న్యూస్ వెబ్​సైట్​ను కూడా బ్లాక్ చేసింది.

భారత్ లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై పలు యూట్యూబ్‌ ఛానెళ్లు అసత్య వార్తలను ప్రచారం చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. న్యూస్‌ ఛానెళ్లలాగానే లోగోలు, థంబ్ నెయిల్స్ వాడుతూ… వీక్షకులను తప్పుదోవ పట్టిస్తున్నట్లు గుర్తించింది.

వీటితో పాటు భారత భద్రతా దళాలు, జుమ్మూ కశ్మీర్ అంశాలతో పాటు భారత్ కు వ్యతిరేకంగా పాకిస్థాన్ కేంద్రంగా మరికొన్ని యూట్యూబ్ ఛానెళ్లు అసత్య సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారనే కారణంగా వాటిపై నిషేధం విధిస్తున్నట్లు కేంద్ర సమాచార, ప్రసారశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

Advertisement

Read Also : Shankar Ram Charan : పొలిటిషియన్ లుక్‌లో సైకిల్‌పై రామ్ చరణ్.. ఫొటో లీక్..!

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel