Interesting news: పెళ్లికి నో చెప్పాడు.. కానీ అందుకోసం వచ్చి అడ్డంగా దొరికిపోయాడు

Interesting news: ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లడం అంటే మామూలు విషయం కాదు. ప్రేమించుకోవడానికి అమ్మాయి, అబ్బాయి ఇష్టపడితే సరిపోతుంది. కానీ పెళ్లికి అలా కాదు.. రెండు కుటుంబాలు అంగీకరించాలి. వారిని ఒప్పించగలగాలి. అప్పుడే వారి అంగీకారంతో పెళ్లి జరుగుతుంది. పెద్దవాళ్లను ఒప్పించలేక చాలా మంది ఇష్టంలేని పెళ్లి చేసుకుంటారు. జీవితాంతం అలాగే బాధపడుతుంటారు.

కొందరు మాత్రం ప్రేమ అనే పేరును తగిలించుకుని అవసరాలు తీర్చుకుంటారు. కొన్ని రోజులు ఎంజాయ్ చేశాక వదిలేయవచ్చని అనుకుంటారు. పెళ్లి అనే ఎత్తగానే పారిపోతారు. వివాహ ప్రస్తావన తేగానే తప్పించుకుని తప్పించుకు తిరుగుతుంటారు. ఇలాంటి ఘటన బీహార్ లో జరిగింది.


బీహార్ లోని నవాడా జిల్లాలో ఈ ఘటన జరిగింది. రాజుఖాన్, షబానా పర్వీన్ ఇద్దరు ప్రేమించుకున్నారు. కొన్నేళ్లుగా రిలేషన్ లో కూడా ఉన్నారు. ఈ క్రమంలో రాజు ఖాన్ ముంగేకర్ అనే గ్రామానికి చెందిన వాడు కాగా… షబానా ఖంకనా పూర్ కు చెందినది. రాజు తరచూగా షబానాను సీక్రెట్ గా కలుసుకునే వాడు. ఆమె ఎన్నో సార్లు పెళ్లి ప్రస్తావన తీసుకురాగా… అతడు దాటవేస్తూ వచ్చాడు. తన ప్రియురాలిని కలుసుకోవడానికి సీక్రెట్ ఆమె ఇంటికి వచ్చాడు.

Advertisement

ఈసారి వారి చుట్టు పక్కల వాళ్లు గమనించి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆ తర్వాత యువతిని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని అడిగారు. ఆమె ఓకె చెప్పడంతో వెంటనే పెళ్లి ఏర్పాట్లు చేశారు. అక్కడే వివాహం జరిపించారు. ఆమెను అత్తగారింటికి సాగనంపారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel