Gold Rates Today : హైదరాబాద్ మార్కెట్‌లో తగ్గిన బంగారం ధరలు.. ఎంతో తెలుసా?

Updated on: April 3, 2022

Gold Rates today : దేశ వ్యాప్తంగా ప్రధాన మార్కెట్లలో చాలా వరకు బంగారం వెండి ధరలు తగ్గాయి. హైదరాబాద్ తో పాటు ఢిల్లీ, బెంగళూర్, చెన్నె, విజయవాడలో బంగారం ధరలు దిగొచ్చాయి. హైదరాబాద్ మార్కెట్లో ఆదివారం మేలిమి పుత్తడి ధర రూ.160 తగ్గి.. తలం ప్యూర్ గోల్డ్ ధర రూ. 52,470 నుంచి రూ. 52, 310కి చేరుకుంది. అలాగే ఏపీలోని విజయవాడలో కూడా బంగారం, వెండి ధరలు తగ్గాయి. 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.160 తగ్గింది. దీంతో ఈ ధర రూ.52,470 నుంచి రూ.52,310కు పడిపోయింది. కేజీ వెండి ధర రూ.400 తగ్గి రూ.71,300గా రికార్డయింది.

దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలలో స్వల్ప మార్పులు మాత్రమే చోటు చేసుకున్నాయి. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర ఢిల్లీలో రూ.150 తగ్గి రూ.47,950కు పడిపోయింది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర మాత్రం స్వల్పంగా రూ.10 మాత్రమే పెరిగి రూ.52,480కు చేరుకుంది. వెండి ధర మాత్రం ఢిల్లీలో భారీగా పెరిగింది. ఒక్కసారిగా కేజీ వెండి ధర రూ.3,700 పెరిగి రూ.71,300గా నమోదైంది.

Read Also : Actress Hema Reaction : నా పేరు బద్నాం చేస్తున్నారంటూ హేమ షాకింగ్ కామెంట్స్..!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel