Facebook Reels: ఇన్‌స్టా తరహాలోనే ఫేస్‌బుక్‌ రీల్స్‌…!

Updated on: February 23, 2022

Facebook Reels: టిక్‌టాక్ తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌, యూట్యూబ్‌ రీల్స్‌ ప్రజల్లో బాగా ఊపందుకున్నాయి. దానితో ఇప్పుడు సోషల్‌ మీడియో దిగ్గజం ఫేస్‌బుక్‌ కూడా ఈ తరహా ఫీచర్‌ను లాంచ్‌ చేసింది. మరి దాని పూర్తివివరాలు ఏంటో చూసేద్దామా..!

face book reels

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ షార్ట్ వీడియో ఫీచర్ ‘రీల్స్‌ను ప్రపంచవ్యాప్తంగా 150 దేశాల్లో అందుబాటులోకి తెచ్చింది. ఈ విషయాన్ని ఫేస్‌బుక్‌ మెటా సంస్థ ప్రకటించింది. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ ఫేస్‌బుక్‌ యాప్‌లోనే రీల్స్ సెక్షన్ ఉంటుందని పేర్కొనింది.

Advertisement

ఫేస్‌బుక్ యాప్‌లో రీల్స్ ఫీచర్.. యాప్‌ అప్‌డేట్‌ ద్వారా యాడ్ కానుంది. ఇప్పటికే చాలా మందికి ఈ అప్‌డేట్‌ వచ్చింది. కాగా మరికొన్ని వారాల్లో యూజర్లందరికీ రీల్స్ ఫీచర్ అందుబాటులోకి వస్తుందని మెటా పేర్కొంది. “రీల్స్ ఇప్పటికే వేగంగా ఎదుగుతున్న కంటెంట్ ఫార్మాట్‌గా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఫేస్‌బుక్ వాడుతున్న వారికి దీన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నాం” అని మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ఫేస్‌బుక్ పోస్ట్‌ ద్వారా వెల్లడించారు. పేస్‌బుక్‌ వాడుతున్న వారు సగం సమయానికిపైగా వీడియోలు చూస్తున్నారని మెటా పేర్కొంది. రీల్స్‌ ఫీచర్.. వీడియో క్రియేటర్లకు డబ్బు సంపాదించేందుకు కొత్త దారిగా ఉంటుందని మెటా సంస్థ వెల్లడించింది.

కాగా 2021 చివరి త్రైమాసికంలో ఫేస్‌బుక్‌ యాక్టివ్ యూజర్ల సంఖ్య తగ్గడంతో మెటా షేర్ల విలువ సైతం అమాంతంగా పడిపోయింది. ఈ నేపథ్యంలో యూజర్లు ఎక్కువగా వినియోగిస్తున్న వీడియో కంటెంట్‌పైనే ఎక్కువగా దృష్టి సారించాలని పేస్‌బుక్‌ నిర్ణయించుకుంది. అందుకే రీల్స్ ఫీచర్‌ (Reels Feature)ను యూజర్లందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమైంది. ఇన్‌స్టా గ్రామ్‌లో ఉండే అన్ని ఫీచర్లు దీనిలో ఉంటాయని వెల్లడించింది.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel