Extra Jabardasth : ఎక్స్‌ట్రా జబర్దస్త్ ఎమోషనల్.. ఎవరి దిష్టి తగిలిందో అంటూ ఎక్కెక్కి ఏడ్చేసిన ఇంద్రజ..!

Updated on: June 5, 2022

Extra Jabardasth : ఎప్పుడు నవ్వులతో సాఫీగా సాగిపోయే జబర్దస్త్ కామెడీ షో.. ఫుల్ ఎమోషనల్ అయింది. ఇప్పటివరకూ ఒకే జట్టుగా స్కిట్ల మీద స్కిట్లు కొడుతూ టాప్ పొజిషనల్ లోకి దూసుకొచ్చిన సుడిగాలి సుధీర్ టీం చీలిపోయింది. ముందుగా గెటప్ శ్రీను వెళ్లిపోయాడు.. ఆ వెంటనే సుడిగాలి సుధీర్ కూడా వెళ్లిపోయాడు.. ఇక మిగిలింది ఆటో రాంప్రసాద్ మాత్రమే.. ఇప్పుడు ఇదే జబర్దస్త్ టీం మొత్తాన్ని ఫుల్ ఎమోషనల్ చేసింది. జడ్జ్ ఇంద్రజ నుంచి ప్రతిఒక్కరూ కన్నీంటిపర్యంతమయ్యారు. జబర్దస్ షోలో రోజా తర్వాత అదే స్థాయిలో ఇంద్రజ మెప్పిస్తున్నారు.

Extra Jabardasth : indraja emotional after leaving sudheer from extra jabardasth Show
Extra Jabardasth : indraja emotional after leaving sudheer from extra jabardasth Show

గెస్టు జడ్జ్ గా ఎంటరై జబర్దస్త్ జడ్జిగా నిలబడిపోయారు. రోజా లేని లోటు లేకుండా జబర్దస్త్ కామెడీ షోను ముందుకు నడిపిస్తోంది. శ్రీదేవి డ్రామా కంపెనీతో పాటు జబర్దస్త్ కామెడీ షోను కూడా మళ్లీ ట్రాక్ లోకి పెడుతోంది. అయితే జబర్దస్త్ కంటెస్టెంట్లలో సుధీర్‌ చాలా క్లోజ్ అయ్యాడు. అలాంటి సుధీర్ ఇప్పుడు జబర్దస్త్ షో విడిచి వెళ్లిపోయాడనే విషయాన్ని ఇంద్రజ జీర్ణించుకోలేపోయారు. ఒక్క ఇంద్రజనే కాదు.. జబర్దస్త్ కంటెస్టెంట్లందరూ అదే ఫీలవుతున్నారు. ఆటో రాం ప్రసాద్ అయితే ఒంటరిగా ఫీలవుతున్నాడు.

ఇకపై తాను ఎవరితో స్కిట్ చేయాలంటూ బోరుమని ఏడ్చేశాడు. సుధీర్, ఇంద్రజలా ట్రాక్ బాగా హిట్ అయింది. ఆ మధ్యన సుధీర్, ఇంద్రజ తల్లి కొడుకు స్కిట్ చేశారు. అది బాగా పేలింది. ఇప్పుడు సుధీర్ షోను వదిలివెళ్లడంతో అంతా ఎమోషనల్ అవుతున్నారు. ఎక్స్ ట్రా జబర్దస్త్ నుంచి కూడా సుధీర్ వెళ్లిపోయాడు. వచ్చే వారం జబర్దస్త్ కామెడీ షో ప్రోమోలో ఇంద్రజ ఎమోషనల్ అయిన సీన్ వైరల్ అవుతోంది. ఎవరి దిష్టి తగిలిందో మన అందరికి ఇలా అయిందని, సుధీర్ వెళ్లిపోవడం చాలా బాధగా ఉందంటూ కంటతడి పెట్టుకున్నారు. సుధీర్ షోలో లేడనే విషయాన్ని గుర్తుచేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రోమోలో ఆటోరాం ప్రసాద్ మాత్రం కంటిన్యూగా ఎమోషనల్ అవుతూనే ఉన్నాడు.

Read Also : Auto Ramprasad : సుధీర్, గెటప్ శీను లేకపోవడంతో ఒంటరైనా ఆటో రాంప్రసాద్.. ఎవరితో స్కిట్ చేయాలంటూ కంటతడి!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel