Akhil sarthak: ఒకరు కుక్కతో, మరొకరు కులంతో.. ఇప్పుడెలా బ్రేకప్ చెప్పారో తెలుసా?

Akhil sarthak: బిగ్ బాస్ లోకి వచ్చే వరకూ అఖిల్ సార్థక్ గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ ఫోర్త్ సీజన్ లో మోనాల్ గజ్జర్ తో లవ్ ట్రాక్ నడిపి రన్నర్ గా నిలిచాడు. అలాగే రీసెంట్ గా బిగ్ బాస్ ఓటీటీలోనూ కంటెస్టెంట్ గా వెళ్లి మరీ రన్నరప్ గా నిలిచాడు. అయితే గత సీజన్ లోనే ఆయన తన బ్రేకప్ స్టోరీలను రివీల్ చేశాడు. అయితే తాజాగా మరోసారి ఆయనకు ఎవరో బ్రేకప్ చెప్పినట్లు ఆయన పెట్టిన ఓ పోస్టు ద్వారా తెలుస్తోంది. అయితే ఆ అమ్మాయి ఎవరు వంటి విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

గతంలో తాను ప్రేమించిన ఓ అమ్మాయి తనను కుక్కతో పోల్చిందని గతంలో చెప్పిన సంగతి తెలిసిందే. అలాగో మరో అమ్మాయి కూడా నీ కులం తక్కువ అంటూ తనను దూరం చేస్కుందని వివరించాడు. తాజాగా మరోసారి తన లవ్ బ్రేకప్ అయ్యిందంటూ పోస్ట్ పెట్టడంతో… అందరూ ఆమె మోనాల్ గజ్జర్ యే కావచ్చొని అనుకుంటున్నారు. అయితే అఖిల్ పెట్టింది ఎమోజీలే అయినప్పటికీ అందులో చాలా అర్థమే ఉంది. తాను ప్రేమించిన అమ్మాయి వేరే అబ్బాయితో ఉన్నట్లుగా ఎమోజీ ఉండటం.. తాను ప్రేమించిన అమ్మాయి వేరే వాళ్లతో ఉన్నట్లు పెట్టాడు. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel