Karthika Deepam : తాడికొండ గ్రామానికి చేరుకున్న ఆనందరావు, సౌందర్య.. జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న కార్తీక్?

Updated on: January 11, 2022

Karthika Deepam : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ సీరియల్ కుటుంబ కథ నేపథ్యంలో ట్విస్టులతో కొనసాగుతోంది. అంతేకాకుండా ఈ సీరియల్ రేటింగ్ లో మొదటి స్థానంలో దూసుకుపోతోంది. ఇక ఈ రోజు ఎపిసోడ్స్ లో ఏమేమి హైలెట్స్ జరిగాయో తెలుసుకుందాం..

ఆనందరావు, సౌందర్య మనశ్శాంతి కోసం లగేజ్ సర్దుకొని బయటకు వెళ్తుంటారు. ఇంతలో గా కారులో మోనిత వచ్చి సౌందర్య ఇంటి ముందు కారు ఆపుతుంది. ఇక రాత్రి సమయంలో బయలుదేరుతుడడంతో కార్తీక్, దీపాల ఆచూకీ వీరికి తెలిసి ఉంటుంది అని మోనిత అనుకుంటూ ఉంటుంది. ఇక సౌందర్య, ఆనందరావు, ఆదిత్య శ్రావ్య లకు జాగ్రత్తలు చెప్పి బయలుదేరగా మోనిత వారిని ఫాలో అవుతూ వెళ్తుంది.

Advertisement

మరోవైపు కార్తీక్, దీప లు రంగరాజు తో మాట్లాడుతూ ఉంటారు. కార్తీక్,బాబుని ఎత్తుకొని ముద్దాడుతూ ఉంటాడు. కార్తీక్ ఆ బాబునీ ఏరా అంటుండగా దీప అలా అనకండి వాడి పేరు మామయ్య గారి పేరు అనగా కార్తీక్ తన గతాన్ని మరొక సారి గుర్తు తెచ్చుకొని బాధపడతాడు. ఇంతలో దీప మనం ఇక్కడికి వచ్చింది చేదు జ్ఞాపకాలు మర్చిపోవడానికి, మళ్లీ మోనిత పేరు గుర్తు తెచ్చుకోకండి అని కార్తీక్ కి చెబుతుంది.

ఇక మరొకవైపు మోనిత, సౌందర్య, ఆనందరావు ల కారును ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది. బ్యాగ్ సర్దుకుని వెళ్తున్నారు అంటే కచ్చితంగా కార్తీక్ ఆచూకి తెలిసే ఉంటుంది అని అనుకుంటూ ఉంటుంది మోనిత. ఇక కార్తీక్ ఇంట్లో బియ్యం కూడా లేవని బాధ పడుతూ ఉండగా, ఇందాక వచ్చేటప్పుడు నేను తీసుకువచ్చాను అంటూ దీప చెబుతుంది. డాక్టర్ బాబు పిల్లలకి మధ్యాహ్నం స్కూల్ కి అన్నం తీసుకువెళ్లారంటగా, మీతో డబ్బులు లేవు కదా ఎలా తీసుకు వెళ్లారు అని దీప ప్రశ్నించగా.. డబ్బులు మాత్రమే లేవు దీప బోలెడు ప్రేమ ఉంది అని కార్తీక్ సమాధానం ఇస్తాడు.

ఇక సౌందర్య, ఆనందరావు లు ప్రయాణిస్తూ తాడికొండ గ్రామానికి చేరుకుంటారు. వారిని ఫాలో అవుతూ మోనిత కూడా అక్కడికి చేరుకుంటుంది. కార్తీక్ తన పిల్లలకు భోజనం వడ్డిస్తుండగా, హిమ, సౌర్య డాడి అన్నం జిగురు జిగురుగా ఉంది అని అనగా.. అలా అనకూడదు అంటూ కార్తీక్ పిల్లలకు చెబుతాడు. మరొకవైపు ఆనందరావు, సౌందర్య తాడికొండ గ్రామంలోని ప్రకృతి వైద్యశాల కు చేరుకుంటారు.

Advertisement

Read Also : Karthika Deepam : పిల్లల భోజనం కోసం హోటల్‌లో పని చేయడానికి సిద్ధమైన డాక్టర్ బాబు!

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel