Viral News: ఛీ.. ఛీ అందంగా కనిపించడం కోసం ఇలా కూడా చేస్తారా.. ఈ వ్యక్తి చేసిన పని తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Viral News: అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు.ఈ క్రమంలోనే అందం కోసం ఎన్నో రకాల ఆహార పదార్థాలను తీసుకోవటమే కాకుండా మార్కెట్లో లభించే కొన్ని సౌందర్య ఉత్పత్తులను కూడా ఉపయోగిస్తూ వారి అందాన్ని కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఒక వ్యక్తి తన ఆనందం కోసం చేసిన పని తెలిస్తే ప్రతి ఒక్కరూ షాకవ్వాల్సిందే. షాక్ అవ్వడమే కాకుండా ఆ వ్యక్తి చేసిన పని తెలిస్తే ఛీ.. ఛీ అనక మానరు. ఇంతకీ యవ్వనం కోసం ఆ వ్యక్తి ఏం చేశాడనే విషయానికి వస్తే…

సాధారణంగా యవ్వనం కోసం చాలామంది పౌష్టిక ఆహారం తీసుకోవడమే కాకుండా, కొన్ని శరీర వ్యాయామాలు చేస్తూ అందం కోసం ఆరాటపడుతుంటారు. కానీ ఇంగ్లండ్‌కు చెందిన 34 ఏళ్ల వ్యక్తి హ్యారీ మటాడిన్ యవ్వనంగా ఉండడం కోసం గత పది సంవత్సరాల నుంచి తన మూత్రాన్ని తానే తాగుతున్నారు. ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరూ ఎంతో షాక్ కి గురయ్యారు. న్యూయార్క్ పోస్ట్ తెలిపిన వివరాల ప్రకారం హ్యారీ 2016లో తన మానసిక సమస్యలనును పరిష్కరించుకునేందుకు ఇలా తన మూత్రాన్ని తాగుతున్నట్లు తెలిపారు.

గత పది సంవత్సరాల నుంచి రోజుకు రెండు వందల మిల్లీ లీటర్ల మూత్రాన్ని తాగుతున్నాడు. ఇలా తాగడం వల్ల తాను డిప్రెషన్ నుంచి బయటపడినట్లు హ్యారీ వెల్లడించారు. ఇలా యూరిన్ తెరఫీ ద్వారా మానసిక సమస్యలు తగ్గడమే కాకుండా మెదడు కూడా ఎంతో చురుగ్గా పనిచేస్తుందని అలాగే వయసు తక్కువగా కనపడుతూ యవ్వనంగా ఉంటామని తెలిపారు. ఇకపోతే తన మూత్రం రుచి వాసన తనకు ఎంతగానో నచ్చుతాయని ఈయన వెల్లడించారు. హ్యారీ తన మూత్రం వలన కలిగే ప్రయోజనాలను వివరిస్తూ, దానిని ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నాడు. అయితే హ్యారీ చర్యలతో తమ కుటుంబ సభ్యులు ఎంతో ఇబ్బంది పడటమే కాకుండా అతని వ్యవహార శైలిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel