Director Tatineni Ramarao passed away: ప్రముఖ దర్శకుడు తాతినేని రామారావు మృతి

చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు నెలకొంటున్నాయి. ఈ మధ్య కాలంలో చాలా మంది సినీ ప్రముఖులు అనారోగ్యంతో మృతి చెందుతున్నారు. తాజాగా ప్రముఖ దర్శకుడు తాతినేని రామారావు(84) కన్ను మూశారు. చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్​ కళాశాల ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం అర్ధ రాత్రి తుది శ్వాస విడిచినట్లు తెలిసింది.

తాతినేని రామారావు.. 1938 కృష్ణా జిల్లా, కపిలేశ్వరపురంలో జన్మించారు. ‘నవరాత్రి’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఆయన.. ఎన్టీఆర్​ ‘యమగోల’, ‘జీవనతరంగాలు’, ‘దొరబాబు’, ‘ఆలుమగలు’, ‘అనురాగ దేవత’, ‘న్యాయానికి సంకెళ్లు’ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ‘యమగోల’ చిత్రాన్ని ‘లోక్‌పరలోక్‌’ పేరుతో హిందీలో రూపొందించారు. ‘జీవన్‌ధార’, ‘అంధాకానూన్‌’, ‘ఏ దేశ్‌’, ‘దోస్తీ’, ‘దుష్మనీ’, ‘రావణ్‌రాజ్‌’, ‘బులాండీ’, ‘భేటీ నెం.1’ సహా పలు బాలీవుడ్​ చిత్రాలకు డైరెక్టర్​గా వ్యవహరించారు. మొత్తంగా 1962 నుంచి 2000 వరకు తెలుగు, హిందీలో కలిపి దాదాపు 70 సినిమాలను తెరకెక్కించారు. కాగా, ఆయన మృతి పట్ల పలువురు సినీప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel