Jabardasth faima : బుల్లితెరపై ఫైమా చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఆమె చేసే చేష్టలు, వేసే పంచులకు అందరూ పగలబడి నవ్వుతారు. ఇక ఫైమా రాకతోనే బుల్లెట్ భాస్కర్ టీం దూసుకుపోతుందనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అసరం లేదు. ఈ మధ్య వరుసగా స్కిట్లు కొడుతూ… బుల్లెట్ భాస్కర్ టీంకు మెయిన్ కంటెంస్టెంట్ గా ఫైమా మారిపోయింది. ఫైమా, ఇమ్మాన్యుయేల్, వర్షలతోనే బుల్లుటె భాస్కర్ స్కిట్లు కొడుతున్నాడు. ఇలా ఈ నలుగురి కాంబినేషన్ కు వాళ్లు చేసే స్కిట్లకు అందరూ ఫిదా అవుతున్నారు. ఇకపై ఫైమా టైమింగ్ మాత్రం వేరే లెవెల్ అని ప్రశంసలు వస్తుంటాయి.
బుల్లెట్ భాస్కర్ ను పైమా ప్రతీ సారి తన కొంటర్లతో ఆడుకుంటూ ఉంటుంది. ఫైమా, వర్ష, ఇమ్మాన్యుయేల్ ఫన్ మామూలుగా ఉండదు. ఇక బుల్లెట్ భాస్కర్ ను అందరూ కలిసి ఏడిపిస్తుంటారు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమేలో బుల్లెట్ భాస్కర్ ను చాలా దారుణంగా అవమానించింది పైమా. ఈ స్కిట్ లో బుల్లెట్ భాస్కర్, ఫైమా భార్యాభర్తలుగా నటించారు. లావుగా ఉన్నావు, సర్జరీ చేయించుకోవాలని బుల్లెట్ భాస్కర్ తన భార్యను కోరతాడు. దీంతో ఆయన భార్య ఫైమాలా మారిపోతుంది. ఆ తర్వాత నువ్వు లావుగా ఉన్నావంటూ ఫైమా భర్తను ఆడుకుంటుంది.
నువ్వు చేసే ఏ పనైనా నేను చేస్తానంటూ ఫైమాతో భాస్కర్ ఛాలెంజ్ విసురుతాడు. దీంతో ఫైమా తన యోగసానాలు వేస్తుంది. కానీ చేయలేకపోతాడు. దాన్ని కవర్ చేస్కునేందుకు నా కండలు చూసి.. పెద్ద పెద్దవి చెప్పు అంటాడు. దీంతో ఫైమా స్కూటర్ లేమని చెప్తుంది. అయితే భాస్కర్ స్కూటీని లేపేందుకు నానా కష్టాలు పడతాడు. కానీ ఎత్తలేక పోతాడు. పంటితో దీన్ని లేపు అంటుంది. దీన్ని పంటితో ఎవడైనా లేపుతాడా అనగానే… నేను లేపుతానంటూ వెళ్లి లేపి చూపిస్తుంది. దీంతో సెట్ లో ఉన్న వారందరూ షాక్ అవుతారు.
Read Also : Jabardasth Promo : వాడు నిన్నేం చేస్తాడులే.. అయ్యో.. అజర్ పరువు తీసిందిగా రీతూ.. వీడియో..!