Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Period Problems : నెలసరి సమస్యలా.. ఇది ట్రై చేయండి.. ప్రతినెలా నెలసరి అసలు ఆగదు..!

Period Problems : మహిళల్లో అతి సాధారణ సమస్య.. నెలసరి తప్పడం… చాలామంది మహిళల్లో ఈ సమస్య వేదిస్తుంటుంది. అయితే ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియక తమలోనే తాము బాధపడిపోతుంటారు. నెలసరి అనేది క్రమతప్పకుండా ప్రతినెలా అదే సమయంలో వస్తుంటే.. వారికి నెలసరి ఆరోగ్యంగా ఉందని అర్థం. అలా కాకుండా నెలసరి ప్రతినెలా రాకుండా.. వచ్చినా చాలా నొప్పితో పాటు ఇబ్బంది పడుతుంటారు. రెగ్యులర్ పిరియడ్స్ వస్తే సరే.. కానీ, రెగ్యులర్ కాకుండా అప్పుడప్పుడు వస్తుంటే పీరియడ్స్ అనేక సమస్యలకు దారితీస్తాయని గుర్తించుకోండి. అందుకే నెలసరి సమస్యను ప్రారంభంలోనే నివారించుకునేందుకు ప్రయత్నించాలి.

దీనికి తోడు ఇన్ఫెక్షన్లు పెరిగి ఇతర అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి జాగ్రత్త అంటున్నారు వైద్యనిపుణులు. నెలసరి సమస్యను తగ్గించుకోవడానికి చాలామంది మందులను వాడుతుంటారు. వైద్యుని సలహాతో మందులు వాడినా నెలసరి సమస్య పోవకపోవడమే కాకుండా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటాయి. మందులతో కాకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నెలసరి సమస్యను ఎలా అధిగమించాలో తెలుసా? అయితే మీరు తప్పకు ఈ హోం రెమిడీ గురించి తెలుసుకోవాల్సిందే..

ఇంట్లో చేసుకునే ఈ అద్భుతమైన చిట్కాను పాటిస్తే తప్పకుండా అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. మీకు రెగ్యులర్ పీరియడ్స్ టైంకు రావాలంటే మంచి వ్యాయామం చేయాలి.. అలాగే ఆహారపు అలవాట్లు ఆరోగ్యకరంగా ఉండాలి. పీరియడ్స్ సమస్యతో ఇబ్బందులు పడేవారు.. ప్రతిరోజూ తప్పకుండా వ్యాయామం చేయాలి. ఇది మీరు లేవగానే ఒక అలవాటు చేసుకోవాలి. పంచదార, మైదా వంటి పిండి పదార్థాలను అసలే తినొద్దు.. దీంతో పాటు ఈ చిన్న రెమడీ కూడా పాటించండి..

Advertisement

Period Problems : ఈ చిట్కాతో నెలసరి సమస్యలకు చెక్ పెట్టండి..

Periods Problems : How to Get Regular Periods Naturally, These Home Remedies for Irregular Periods 

సెలసరి క్రమం తప్పకుండా రావాలంటే ప్రతిరోజూ ఒక గ్లాసు వేడి నీటిని తీసుకోవాలి. అందులో కొంచెం జీలకర్ర పొడిని స్పూన్ వేసుకోవాలి. పసుపు పావు స్పూన్ కూడా వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఒక నిమ్మకాయను తీసుకొని అరచెక్క నిమ్మరసాన్ని పిండాలి. ఒక స్పూన్ టమాటా రసాన్ని కూడా ఆ మిశ్రమంలో వేసి కలపాలి. అలా గోరువెచ్చగా ఉండగానే మీరు రాత్రి పడుకునే ముందు తాగేయాలి.

మూడు నెలలు అయినా పీరియడ్స్ ఒక్కసారి కూడా రాలేదంటే.. ఈ మిశ్రమాన్ని మాత్రం రోజుకు రెండు పూటలా తాగేయాలి. ఉదయం, రాత్రి తాగడం మంచిది. ఈ మిశ్రమాన్ని తాగిన తరువాత ఒక బెల్లం ముక్కను తీసుకుని తినేయండి. ఇలా చేస్తుంటే కొద్దిరోజుల్లోనే మీలో పీరియడ్స్ సమస్యను తగ్గించుకోవచ్చు. ఈ రకమైన మిశ్రమాన్ని వాడటం ద్వారా ఒంట్లో కొవ్వు కరిగిపోయి తొందరగా బరువు తగ్గి సన్నబడిపోతారు.

Read Also : Horoscope: ఈ రెండు రాశుల వాళ్లు ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి సుమీ..!

Advertisement
Exit mobile version