Hair Growth Tips : అధిక జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారా… ఈ నూనె రాస్తే చాలు పది రోజులలో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు?

Hair Growth Tips : అమ్మాయికైనా, అబ్బాయికైనా వారి అందం రెట్టింపు కావాలంటే జుట్టు తప్పనిసరి. జుట్టు ఉన్నప్పుడే వారి అందం రెట్టింపు అవుతూ ఎంతో అందంగా కనపడతారు. ఈ క్రమంలోనే అందమైన పొడవైన ఒత్తైన జుట్టు కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.ప్రస్తుతం ఉన్న ఆహారపు అలవాట్లు వాతావరణ కాలుష్యం వల్ల చాలా మంది అధిక చుండ్రు వల్ల జుట్టు సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే జుట్టు పెరుగుదల కోసం ఎన్నో చిట్కాలు ప్రయత్నిస్తూ ఉన్నప్పటికీ ఏమాత్రం ఫలితం ఉండదు. ఈ విధమైనటువంటి సమస్యతో బాధపడేవారికి గుంటగరగరాకు చక్కటి పరిష్కార మార్గం అని చెప్పవచ్చు.

Hair Growth Tips
Hair Growth Tips

పల్లెల్లో పొలాల గట్లలో లభించే గుంటగరగరాకు జుట్టురాలే సమస్యకు చెక్ పెట్టడం కాకుండా పొడవైన, ఒత్తైన జుట్టును అందిస్తూ తెల్ల జుట్టు సమస్యలను కూడా పారద్రోలుతుంది. సమయంలోనే పొలాల్లో దొరికే ఈ ఆకులను తీసుకువచ్చి శుభ్రంగా కడిగి మిక్సీలో మెత్తని మిశ్రమంలా తయారు చేసుకోవాలి.ఇక ఈ మిశ్రమాన్ని బాగా వడబోసి ఒక కప్పు గుంటగరగరాకు రసంలోకి ఒక కప్పు కొబ్బరి నూనె వేసి చిన్న మంటపై బాగా మరిగించాలి. ఈ గిన్నెలో గుంటగరగరాకు మొత్తం ఆవిరి అయ్యి నూనె మిగిలే వరకూ మరిగించాలి.

ఈ నూనెను ఒక సీసాలో నిల్వ ఉంచుకొని ప్రతిరోజు మన జుట్టు కుదుళ్ళకు అంటుకునేలా రాసుకోవాలి. ఇలా 10 రోజుల పాటు క్రమం తప్పకుండా చేయడం వల్ల జుట్టు రాలే సమస్యను పూర్తిగా తగ్గించవచ్చు. అలాగే రాలిన జుట్టు స్థానంలో కొత్త జుట్టు రావడం, చుండ్రు తెల్ల వెంట్రుకల సమస్యలు కూడా తొలగిపోతాయి. మరెందుకాలస్యం వెంటనే సింపుల్ చిట్కాను పాటించి అందమైన జుట్టును మీ సొంతం చేసుకోండి.

Advertisement

Read Also : Hairy tips : నల్ల జుట్టును తెల్లగా మార్చే అద్భుతమైన చిట్కా..!

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel